Mankind Pharma IPO: దేశంలో మరో అతిపెద్ద ఫార్మా ఐపీవో ఈనెల 25 నుంచి సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతోంది. ఈ క్రమంలో కొత్త ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లోకి వస్తున్న ఈ ఐపీవో కొంత మేర ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు.
ఈ క్రమంలో ఫార్మా దిగ్గజం నేడు ఐపీవో ప్రైస్ బ్యాండ్ వివరాలను ప్రకటించింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం షేర్ ధర రూ.1,026 నుంచి రూ.1,080 మధ్య ఉండనుంది. తాజా ఐపీవోలో ప్రమోటర్ గ్రూప్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 4 కోట్ల షేర్లను విక్రయిస్తున్నారు. అంటే ఈ షేర్లను విక్రయించటం ద్వారా వచ్చే డబ్బు కంపెనీకి చేరుకోకుండా.. వాటాలను అమ్మిన ప్రమోటర్లకు వెళుతుంది.

మార్కెట్లో కంపెనీ ప్రకటించిన షేర్ ధరల శ్రేణి అధికంగా ఉన్నందున గ్రే మార్కెట్ ప్రీమియం కొంత తక్కువగానే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఐపీవో గ్రే మార్కెట్ ప్రీమియం 7 శాతంగా ఉందని స్టాక్‌బాక్స్ రీసెర్చ్ హెడ్ మనీష్ చౌదరి వెల్లడించారు. ఈ ఐపీవో ద్వారా ఫార్మా కంపెనీ దాదాపు రూ.4,300 కోట్లను మార్కెట్ల నుంచి సమీకరిస్తోంది. దేశీయ మార్కెట్ల నుంచి కంపెనీ గత ఆర్థిక సంవత్సంలో దాదాపు 97.60 శాతం ఆదాయాన్ని పొందుతోంది.

ఖరీదైన వాల్యుయేషన్‌లు, అధిక రుణాలతో పాటు.. ఐపీవో ద్వారా సమీకరిస్తున్న మెుత్తాన్ని వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించకపోవటం వల్ల గ్రే మార్కెట్ ప్రీమియం రానున్న కాలంలో మరింతగా తగ్గవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మ్యాన్‌కైండ్ ఫార్మా తనను తాను.. సన్ ఫార్మా, జైడస్ లైఫ్ సైన్సెస్, సిప్లా, డాబర్ ఇండియా, ఆల్కెమ్ లాబొరేటరీస్, ఇప్కా లేబొరేటరీస్, టోరెంట్ ఫార్మా, జీఎస్‌కె ఫార్మా, జైడస్ వెల్నెస్‌తో సహా లిస్టెడ్ కంపెనీలతో పోల్చుకుంటోంది.


Click it and Unblock the Notifications