అమెరికా ఫెడరల్ రిజర్వ్ అత్యవసరంగా వడ్డీ రేట్లను తగ్గించిన దరిమిలా యూఎస్ మార్కెట్లు సోమవారం తీవ్రంగా నష్టపోయాయి. సర్క్యూట్ బ్రేకర్లను తాకడంతో పదిహేను నిమిషాలు ట్రేడింగ్‌ను నిలిపివేశారు. సోమవారం భారత మార్కెట్లకు కూడా నష్టాలపర్వం కొనసాగింది. వరుసగా సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాల్లోకి వెళ్తున్నాయి. దీంతో లక్షల కోట్ల కోట్ల ఇన్వెస్టర్ల సంపద నిమిషాలు, గంటల్లో హరించుకుపోతోంది.

వరుసగా భారీ నష్టాలు..
గత సోమవారం (మార్చి 9) సెన్సెక్స్ 1,942 పాయింట్లు నష్టపోయింది. గురువారం (మార్చి 12) 2,919 పాయింట్లు కోల్పోయింది. శుక్రవారం కూడా భారీ నష్టాలతో ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత కాస్త కుదురుకుంది. అయితే సోమవారం (మార్చి 16) మార్కెట్లు తిరిగి మళ్లీ భారీ నష్టాల్లోకి వెళ్లాయి. 2,713 పాయింట్లు నష్టపోయింది.

వరుస సోమవారాలు... అతి భారీ నష్టాలు
వరుసగా రెండు సోమవారాలు మార్కెట్ భారీగా నష్టపోయింది. ఒకరోజులో సూచి అత్యధిక నష్టం చవిచూసింది గత సోమవారమైతే, రెండో నష్టం నిన్న సోమవారం ఉండటం గమనార్హం. నిన్న సెన్సెక్స్ 2713 పాయింట్లు కోల్పోయి 31,390 వద్ద, నిఫ్టీ 758 పాయింట్లు కోల్పోయి 9197 వద్ద క్లోజ్ అయింది.

రూ.7.54 లక్షల కోట్లు ఆవిరి
నిన్న (మార్చి 16) ఒక్కరోజే ఇన్వెస్టర్లు 7.5 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. సెన్సెక్స్ 30 షేర్లు 7.96 శాతం నష్టంతో క్లోజ్ అయ్యాయి. 50 నిఫ్టీ షేర్లు 7.60 నష్టంతో క్లోజ్ అయ్యాయి. దీంతో బీఎస్ఈలో మార్కెట్ క్యాపిటలైజేషన్ 7.54 లక్షల కోట్లు ఆవిరైంది.

ఒక్కరోజులో రూ.58,0092 కోట్ల రిలయన్స్ సంపద ఆవిరి
మార్చి 16న రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ వ్యాల్యూ 58,092 కోట్లు ఆవిరైంది. అత్యధికంగా ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్లు 17.50 శాతం, టాటా స్టీల్ 11 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 10.94 శాతం, యాక్సిస్ బ్యాంకు 10.38 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు9.96 శాతం, ఐటీసీ 9.28 శాతం, ఇన్ఫోసిస్ 9.24 శాతం, ఓఎన్జీసీ 8.73 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 8.67 శాతం నష్టపోయాయి.

యస్ బ్యాంకు జూమ్
హెచ్‌సీఎల్ టెక్ 8.48 శాతం, రిలయన్స్ 8.28 శాతం, ఎన్టీపీసీ 8.19 శాతం, ఎల్ అండ్ టీ 7.99 శాతం, ఎస్బీఐ 7.81 శాతం కుంగిపోయాయి. బ్యాంకింగ్, రియల్, ఐటీ, చమురు షేర్లు 9.3 శాతం వరకు నష్టపోయాయి. ఎస్బీఐ కార్డ్స్ ఇష్యూ ధర రూ.775 అయితే ఇది రూ.683.20 వద్ద క్లోజ్ అయింది. యస్ బ్యాంకు షేర్లు మాత్రం పుంజుకున్నాయి. ఈ షేర్లు మినహా అన్ని నష్టపోయాయి. యస్ బ్యాంకు షేర్ 45.01 శాతం ఎగిసి రూ.37.05 వద్ద క్లోజ్ అయింది.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..



Click it and Unblock the Notifications