Namasthe World: హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో అనేక కంపెనీలు తమ ఉత్పత్తులను ఇక్కడి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా హీరో మనోజ్ నగరంలో కొత్తగా బొమ్మల వ్యాపారంలోకి అడుగుపెట్టారు.
ఈ క్రమంలోనే మంచు మనోజ్, భూమా మౌనిక మంచు దంపతులు నమస్తే వరల్డ్ బ్రాండ్‌తో చిన్నారుల బొమ్మలు కార్టూన్, యానిమేషన్ రూపంలో తీసుకువచ్చేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్ లో నమస్తే వరల్డ్ బ్రాండ్ టాయ్స్ ఔట్‌లెట్ ప్రారంభించారు. దీనిపై స్పందిస్తూ ఇప్పటి వరకు మనం విదేశీలకు చెందిన కల్చర్ అలవాటు చేసుకున్నామని.. ఇప్పుడు దేశీయ కల్చర్ ప్రమోట్ చేసేందుకు తనవంతుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

భారత సంస్కృతి గొప్పదని, దానిని ప్రమోట్ చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు మనోజ్ ఈ సందర్భంగా వెల్లడించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, కళలను వెలికి తీసేందుకు ఇది చక్కటి ఫ్లాట్ ఫాంగా నిలుస్తుందన్నారు. తనకు చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం అలవాటైందని, అదే అలవాటు మౌనికకు ఉందని తెలిపారు. అందుకే ఇద్దరు కలిసి నమస్తే బ్రాండ్ పేరుతో ముందుకు వస్తున్నామన్నారు. తమను ప్రజలు కొత్త వ్యాపారంలో ఆదరించాలని కోరారు. నమస్తే బ్రాండ్ టాయ్స్ దేశంలోని అన్ని జియో ఔట్ లెట్స్ లో లభిస్తున్నాయని, రిలయన్స్ తో పాటు అన్ని షోరూంలలో అందుబాటులో ఉంచామన్నారు.
క్రిస్మస్ సందర్భంగా తన అభిమానులకు అద్బతమైన అవకాశం ఇచ్చారు. చిన్నారులు బొమ్మలు గీసి తమకు పంపిస్తే బొమ్మలుగా మార్చి మార్కెట్‌లో ఉంచుతామని మంచు మనోజ్ తెలిపారు. సృజనాత్మకతతో బొమ్మలు తయారు చేసినవారు తమ వెబ్ సైట్‌కు పంపిస్తే.. వాటిని బొమ్మలు, యానిమేషన్, గేమింగ్‌లో ఉంచి వాటికి ప్రాచుర్యం తీసుకువస్తామన్నారు.


Click it and Unblock the Notifications