భార్యాభర్తల విడాకుల కేసులో కెనడా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. భర్త ఉద్యోగాన్ని వదిలేసినప్పటికీ భార్యకు భరణం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. అత్యధిక జీతం పొందే ఉద్యోగాన్ని వదిలివేసినా.. కుటుంబ పోషణ బాధ్యతల నుంచి తప్పించుకోలేడని సింగపూర్ కుటుంబ న్యాయస్థానం స్పష్టం చేసింది. కెనడాకు చెందిన ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తన భార్య, నలుగురు పిల్లలకు దాదాపు 6.34 లక్షల సింగపూర్ డాలర్లు (సుమారు రూ. 40 కోట్లకు పైగా) బకాయి భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఉద్యోగానికి రాజీనామా చేయడం ద్వారా ఆర్థిక బాధ్యతల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి, అతని భార్య ఇద్దరూ కెనడియన్ పౌరులు. వారు 2013లో తమ నలుగురు పిల్లలతో కలిసి సింగపూర్‌కు వెళ్లారు. ఆ వ్యక్తి ఒక ప్రముఖ సంస్థలో సింగపూర్ కార్యాలయంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ.. 2023 నాటికి వార్షికంగా 8.6 లక్షల సింగపూర్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 6 కోట్లు)కు పైగా సంపాదిస్తున్నాడు. అతని భార్య డిపెండెంట్ పాస్‌పై గృహిణిగా ఉంటటోంది. పిల్లలు అంతర్జాతీయ పాఠశాలల్లో చదువుతున్నారు.

2023 ఆగస్టులో ఆ వ్యక్తి కుటుంబాన్ని విడిచిపెట్టి మరో మహిళతో కలిసి నివసించడం ప్రారంభించాడు. విడిపోయిన తర్వాత మొదటగా భార్యకు నెలకు 20,000 సింగపూర్ డాలర్లు (రూ. 15.5 లక్షలు) నిర్వహణ ఖర్చుగా చెల్లించేందుకు అంగీకరించాడు. అయితే కొద్ది కాలంలోనే ఈ మొత్తాన్ని 11,000 సింగపూర్ డాలర్లకు తగ్గించాడు. ఈ ఆర్థిక సహాయం సరిపోదని భావించిన భార్య.. అక్టోబర్ 2023లో సింగపూర్ మహిళా చార్టర్ చట్టం కింద కోర్టును ఆశ్రయించింది.
ఈ దరఖాస్తు దాఖలైన కొద్ది రోజులకే.. అక్టోబర్ 9, 2023న ఆ వ్యక్తి తన లాభదాయకమైన సింగపూర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. జూలై 2024 వరకు అదే జీతం, ప్రయోజనాలతో కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ, అతను స్వచ్ఛందంగానే ఉద్యోగం వదిలేశాడని కోర్టు గుర్తించింది. అనంతరం జనవరి 2024లో సింగపూర్‌ను వదిలి కెనడాకు వెళ్లిపోయాడు. కోర్టు విచారణలకు హాజరు కాకపోవడంతో అతనిపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. అయితే తరువాత జూమ్ ద్వారా విచారణకు హాజరైన అనంతరం ఆ వారెంట్ ఎత్తివేయబడింది.
కోర్టు విచారణలో.. ప్రస్తుత ఆదాయం మాత్రమే కాకుండా, వ్యక్తి సంపాదించగల సామర్థ్యం, ఆస్తులు, మొత్తం ఆర్థిక వనరులు కూడా భరణం నిర్ణయంలో కీలకమని న్యాయమూర్తి ఫాంగ్ వ్యాఖ్యానించారు. ఉద్యోగానికి రాజీనామా చేసినప్పటికీ.. అతని సంపాదన సామర్థ్యం సింగపూర్‌లో సంపాదించిన స్థాయినే ఆధారంగా తీసుకోవాలని కోర్టు తేల్చింది.
అక్టోబర్ 2024లో అతను కెనడాలో కొత్త ఉద్యోగం ప్రారంభించిన తర్వాత మాత్రమే అతని ఆదాయం తగ్గిందని కోర్టు అంగీకరించింది. అప్పటి నుంచి తల్లిదండ్రులు ఇద్దరూ పిల్లల పోషణకు సమానంగా బాధ్యత వహించాలని ఆదేశించింది. మొత్తం లెక్కల ప్రకారం.. సెప్టెంబర్ 2023 నుంచి సెప్టెంబర్ 2025 వరకు నిర్వహణ ఖర్చు 7.88 లక్షల సింగపూర్ డాలర్లుగా నిర్ధారించబడింది. ఇందులో ఇప్పటికే చెల్లించిన మొత్తాన్ని తీసివేసి.. మిగిలిన 6.33 లక్షల సింగపూర్ డాలర్లు ఒకేసారి చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పుపై ఆ వ్యక్తి అప్పీల్ దాఖలు చేయగా.. అప్పీల్ ఫలితం వచ్చే వరకు ఒకేసారి చెల్లింపు అమలును తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఈ కేసు అధిక జీతం ఉన్న Job వదిలేయడం ద్వారా కుటుంబ బాధ్యతల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదనే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications