Crorepathi: మనకు తెలిసినంత వరకు సహజంగా డబ్బు లేని వారు కొందరు బిచ్చగాళ్లుగా కనిపిస్తుంటారు. కానీ ఒక బిచ్చగాడికి కోట్ల రూపాయల ఆస్తులు, ప్రతినెల ఆదాయం ఉందంటే మీరు నమ్మగలరా.. అసలు ఇంత డబ్బు ఉన్నవాడు బెగ్గర్ ఎందుకు అవుతాడు అనే అనుమానాలు మీకు వచ్చే ఉంటాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే వ్యక్తి దీనికి పూర్తిగా భిన్నమైనది. మనదేశంలోనూ లక్షల్లో బ్యాంక్ బ్యాలెన్స్, ఆస్తులు కలిగిన బిచ్చగాళ్ల గురించి అరుదుగా మనం వింటూనే ఉంటాం.

బ్రిటన్ బెగ్గర్..
బ్రిటన్ రాజధాని అయిన లండన్ నగరంలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన నిరాశ్రయుడైన వ్యక్తిగా నివసిస్తున్నాడు. కానీ వివరాల్లోకి వెళితే అతని ఆదాయం మాత్రం నెలకు లక్షల్లో ఉంది. అతనికి ఇంటి అద్దె రూపంలో ఈ ఆదాయం వస్తోంది.

టాబూ రూమ్ ఇంటర్వ్యూ..
ప్రస్తుతం ఈ వ్యక్తి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. లండన్‌లోని టబూ రూమ్ షోలో టామ్ మాట్లాడాడు. తనకు 5 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయని, నెలకు అద్దెల రూపంలో రూ.1.27 లక్షల ఆదాయాన్ని సైతం సంపాదిస్తున్నట్లు వెల్లడించాడు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన టామ్.. క్రీడల ద్వారా స్కాలర్‌షిప్ పొంది కళాశాలకు వెళ్లాడు. యవ్వన స్వాతంత్ర్యం అతని జీవితాన్ని తలకిందులు చేసిందని చెప్పుకొచ్చాడు.

చెడు అలవాట్లతో..
13 ఏళ్ల వయసులోనే మద్యం, డ్రగ్స్ లాంటి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ముందు గంజాయికి బానిసైన అతడు యుక్త వయస్సు వచ్చే నాటికి హెరాయిన్ కు బానిసయ్యాడు. వీటి నుంచి బయటపడేందుకు పునరావాస కేంద్రానికి వెళ్లిన తర్వాత ఏడేళ్లుగా మళ్లీ అలవాట్లను మానుకోలేక మెల్లగా జీవితాన్ని ముందుకు సాగిస్తున్నట్లు వెల్లడించాడు.
బిచ్చమెత్తుకుంటూ..
రోజూ తాను భిక్షాటన ద్వారా 200-300 పౌండ్లు సంపాదిస్తున్నానని చెప్పుకొచ్చాడు. అయితే నెలవారీ వచ్చే ఇంటి అద్దె ఆదాయాన్ని మాత్రం డ్రగ్స్ కొనుగోలుకు వినియోగిస్తున్నానని టామ్ తెలిపాడు. డ్రగ్స్‌కు అలవాటు పడి ఇంటికి వెళ్లలేక రోజూ స్టేషన్ బయటే నిద్రపోతున్నట్లు పేర్కొన్నాడు. భార్యా పిల్లలతో పాటు 5 లక్షల పౌండ్లు విలువైన సొంత ఇల్లు కూడా ఇతనికి ఉంది. అయితే తన వ్యసనంతో ఇంటిని అమ్మవలసి వస్తుందేమోనని టామ్ చింతిస్తున్నాడు. కానీ ఇప్పుడు అతడిని ఆదుకునేందుకు కుటుంబం, స్నేహితులు కూడా లేకపోవటం బాధాకరం.


Click it and Unblock the Notifications