House for rent: సొంతిల్లు కలిగి ఉండాలని సగటు మధ్యతరగతి వ్యక్తి కోరిక. అయితే ఆ స్తోమత లేని వారు అద్దె ఇళ్లలో కాలం గడుపుతుంటారు. బెంగళూరు వంటి మహానగరంలో అద్దెకి ఇల్లు దొరకడం అంటే ఆషామాషీ కాదు. ఎంతోమంది బ్రోకర్స్ చుట్టూ రోజులు, నెలల తరబడి తిరిగినా దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు. అద్దె ఇళ్ల వ్యవహారం అక్కడ అంత కఠినంగా ఉంటుంది.
ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరులో ఫ్లాట్ అద్దెకు సంపాదించడం చాలా కష్టం. ఇంటర్మీడియట్ లో మార్కులు తక్కువ వచ్చాయని, అత్యంత చిన్న గదికి సైతం భారీ మొత్తంలో అద్దెలు, ఇల్లు అద్దెకిచ్చేందుకు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అడిగే బ్రోకర్లు గురించి పలుమార్లు వార్తలు వచ్చాయి. అందుకే ఇండియన్ సిలికాన్ వ్యాలీలో అద్దెకు దిగడం చాలా వ్యయప్రయాసలతో కూడినది.

అయితే 'యాంటీ-పీక్ బెంగళూరు మూమెంట్' అంటూ గ్రేప్ వైన్ వ్యవస్థాపకులు సౌమిల్ త్రిపాఠి ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. అందులో కేవలం ఒక్క రోజులోనే ఓ వ్యక్తి అద్దెకు ఇల్లు సంపాదించినట్లు పంచుకున్న స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు. దాని ప్రకారం అతడు గురువారం బెంగళూరులో దిగి, శుక్రవారం అంతా బ్రోకర్ తో పాటు కోరమంగలలో కలియతిరిగినట్లు పేర్కొన్నాడు. ఇక శనివారం డీల్ పక్కా చేసుకుని మరుసరి రోజు ఇంట్లోకి దిగినట్లు చెప్పి షాక్ ఇచ్చాడు.
ఈ పోస్ట్ అస్పష్టంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు తమదైన అభిప్రాయాలతో కామెంట్ సెక్షన్ లో హోరెత్తిస్తున్నారు. పలు కంపెనీల్లో భారీ లేఆఫ్స్ వల్ల బెంగళూరులో ఫ్లాట్స్ ఖాళీ అయ్యాయని చెబుతున్నారు. తద్వారా అద్దె ఇళ్లకు డిమాండ్ తగ్గినట్లు అభిప్రాయపడుతున్నారు. ఇవి ఆర్థిక మాంద్యం లక్షణాలేనని ఇంకొందరు కామెంట్ చేశారు.


Click it and Unblock the Notifications