"ఆ రూమ్‌లో ఉంటే చచ్చిపోతానేమో అనుకున్నా.." హైదరాబాద్‌పై బెంగళూరు టెక్కీ సంచలన కామెంట్స్!
ఉద్యోగాల పరంగా చూసినా, లైఫ్ స్టైల్ పరంగా చూసినా సౌత్ ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు నగరాల మధ్య ఎప్పుడూ పెద్ద కాంపిటీషనే ఉంటుంది. ఏ సిటీ బెస్ట్ అనే చర్చ ఐటీ ఉద్యోగుల్లో నిత్యం జరుగుతూనే ఉంటుంది. సరిగ్గా ఇదే విషయంపై, ఐదు నెలల క్రితం బెంగళూరు నుండి హైదరాబాద్‌కు మారిన ఒక యువకుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'రెడ్డిట్' (Reddit) లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.
రెండు నగరాల్లోని కరెంట్ కట్స్, రోడ్లు, వెదర్, ఫుడ్ , ట్రాఫిక్‌ను పోలుస్తూ అతను పెట్టిన రివ్యూపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

"కరెంట్ లేకపోతే బతకడం ఎంత కష్టమో తెలిసొచ్చింది!"
సదరు యూజర్ తన పోస్ట్‌లో హైదరాబాద్‌లోని పవర్ కట్స్‌పై గట్టిగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. "హైదరాబాద్‌కు వచ్చాకే కరెంట్ లేకపోతే జీవితం ఎంత నరకంగా ఉంటుందో నాకు అర్థమైంది" అని రాసుకొచ్చాడు. ముఖ్యంగా ఎండ కాలంలో ఇక్కడ పవర్ కట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని, ఏసీ లేకపోతే రూమ్‌లో వేడి తట్టుకోలేక 'చచ్చిపోతానేమో' అన్నంత భయం వేసిందని వాపోయాడు.
ఎండల విషయంలో బెంగళూరు వాతావరణం చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంటుందని ఈ విషయంలో హైదరాబాద్ వెనుకబడి ఉందని అతను అభిప్రాయపడ్డాడు.
రోడ్లపై గుంతలు లేవు కానీ.. మ్యాన్‌హోల్స్ భయం!
ఇక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక వసతులు) విషయానికి వస్తే.. కెనడాకు చెందిన ఒకరు రీసెంట్‌గా హైదరాబాద్ రోడ్లను పొగిడిన విషయాన్ని గుర్తు చేస్తూనే, ఇక్కడి మరో మైనస్‌ను ఎత్తి చూపాడు. "హైదరాబాద్ రోడ్లపై గుంతలు (Potholes) పెద్దగా లేవు, కానీ సరిగ్గా మూతల్లేని మ్యాన్‌హోల్స్ (Manholes) ఎక్కువగా ఉన్నాయి. రోడ్డు సరిగ్గా చూసుకోకపోతే నేరుగా హాస్పిటల్‌లో జాయిన్ అవ్వాల్సిందే" అని కామెంట్ చేశాడు. బెంగళూరులో గుంతలు ఉన్నా, అవి ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా ఉండవని పేర్కొన్నాడు.
ఫుడ్‌లో హైదరాబాద్ తోపు.. కానీ స్పైసీ!
అయితే ఫుడ్ విషయంలో మాత్రం హైదరాబాద్‌కు జై కొట్టాడు. "తిండి విషయంలో బెంగళూరు అస్సలు హైదరాబాద్‌తో పోటీ పడలేదు" అని ప్రశంసించాడు. కానీ ఇక్కడి ఫుడ్ చాలా మందికి ఎక్కువ కారంగా అనిపించవచ్చని చెప్పాడు.
వీటితో పాటు హైదరాబాద్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ చాలా బెటర్ అని, పీక్ అవర్స్‌లో టైమ్ పట్టినా బెంగళూరు అంత ఘోరంగా ఉండదని మెచ్చుకున్నాడు. ఇక్కడి ప్రజలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారని, అందరికీ హిందీ బాగా అర్థమవుతుందని రాసుకొచ్చాడు. అలాగే హైదరాబాద్ రోడ్లపై లగ్జరీ కార్లు, సూపర్ కార్లు ఎక్కువగా కనిపిస్తాయని.. ఇక్కడి వాళ్లు విపరీతంగా సంపాదిస్తున్నట్లు అనిపిస్తోందని తన పోస్ట్‌లో రాశాడు.
ఈ పోస్ట్‌పై నెటిజన్లు స్పందిస్తూ.. "నువ్వు హైదరాబాద్‌కు చాలా వర్స్ట్ టైమ్‌లో వచ్చావు, గత 30 ఏళ్లలో ఇలాంటి ఎండలు ఎప్పుడూ లేవు" అని ఒకరంటే, "సిటీ మొత్తం ఒకేలా ఉండదు, నువ్వు ఉండే ఏరియాను బట్టి ఎక్స్‌పీరియన్స్ మారుతుంది" అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications