IPO News: ఆశలు సమాధి చేసిన ఐపీవో.. తొలిరోజే బోల్తా పడ్డ ఇన్వెస్టర్లు.. మీరూ కొన్నారా..??
IPO News: గడచిన కొన్ని నెలలుగా మార్కెట్లో లిస్ట్ అవుతున్న వరుస ఐపీవోలు.. కాసుల పంట కురిపిస్తున్నాయి. అడపాదడపా కొన్ని నిరాశకు గురిచేసినప్పటికీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల కంటే ఐపీవోల నుంచి అధికంగా లాభాలను ఆర్జించారు.
ఈ క్రమంలోనే భారీ ఆశల మధ్య నేడు మార్కెట్లోకి హోనస కన్స్యూమర్ ఐపీవో జాబితా అయ్యింది. ఇది బ్యూటీ ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్న మామా ఎర్త్ మాతృసంస్థ. నేడు డిజిటల్ ఫస్ట్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ కంపెనీ షేర్లు BSEలో ఫ్లాట్‌గా లిస్టింగ్ నమోదు చేశాయి. ఇన్వెస్టర్ల అంచనాలను అందుకోవటంలో షేర్ పెద్ద నిరాశను మిగిల్చింది. లిస్టింగ్ తర్వాత కొద్ది సేపటికి బీఎస్ఈలో షేర్ ధర 2 శాతం మేర పెరిగి రూ.331.80 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో ఎన్ఎస్ఈలో షేర్ ధర 1.85 ప్రీమియం ధరకు రూ.330 వద్ద జాబితా చేయబడింది.

వాస్తవానికి కంపెనీ ఐపీవోలో ఒక్కో షేరు విక్రయానికి ప్రైస్ బ్యాండ్ రూ.308-324గా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ కోసం ఐపీవో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు తెరిచి ఉంది. ఇదే క్రమంలో లాట్ పరిమాణాన్ని 46 షేర్లుగా నిర్ణయించింది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.1,701 కోట్లను సమీకరించింది. ఇదే క్రమంలో యాంకర్ ఇన్వెస్టర్లు రూ.765 కోట్ల విలువైన షేర్లను కొనుగోలుచేశారు.
హోనస్ కన్స్యూమర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గతంలోనే ఐపీవోను మార్కెట్లోకి తీసుకురావాలని ప్రయత్నించి దానిని వాయిదా వేసుకుంది. తాజాగా ఐపీవోను ఫ్లోట్ చేసినప్పటికీ ఇన్వెస్టర్ల నుంచి మోస్తరు స్పందన మాత్రమే లభించింది. IPO చివరి రోజున 7.61 సార్లు మాత్రమే సబ్‌స్క్రైబ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్ల రిజర్వ్ కోటా కేవలం 1.35 రెట్లు, సంస్థాగత పెట్టుబడిదారుల కోసం రిజర్వ్ కోటా 11.50 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 4 రెట్లు మాత్రమే సబ్‌స్క్రయిబ్ పొందింది. నేడు షేర్లు 'B' గ్రూప్ ఆఫ్ సెక్యూరిటీలలో ఎక్స్ఛేంజ్‌లో జాబితా చేయబడ్డాయి.


Click it and Unblock the Notifications