IPO News: ఇటీవల వరుస ఐపీవోలకు కొద్దిగా విరామం వచ్చింది. అయితే ఈ గ్యాప్ తర్వాత మార్కెట్లోకి కొత్త కంపెనీ ఐపీవో ఈ నెలలో ప్రారంభం అవుతోంది. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్ల కన్ను ఇప్పుడు దీనిపై పడింది.
వినియోగదారులకు నేరుకు ఉత్పత్తులను విక్రయించే మామాఎర్త్(Mamaearth) మాతృసంస్థ హోసనా కన్జుమర్ లిమిటెడ్ తన ఐపీవోతో ఈనెల మార్కెట్లోకి వచ్చేస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం ఈ ఐపీవో అక్టోబర్ 31న తెరవబడుతోంది. నవంబర్ 2న ఐపీవో క్లోజ్ అవుతున్నప్పటికీ అక్టోబర్ 30న యాంకర్ ఇన్వెస్టర్ల కోసం తెరవబడనున్నట్లు సెబీ ఫైలింగ్స్ ప్రకారం వెల్లడైంది.

ఈ ఐపీవోలో రూ.365 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల ఫ్రెష్ ఇష్యూ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇదే క్రమంలో 41.25 మిలియన్ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఇది గతంలో విక్రయించాలనుకున్న 46.82 మిలియన్ షేర్ల కంటే తక్కువ కావటం విశేషం. ఐపీవో కోసం కంపెనీ మార్కెట్ రెగ్యులేటరీ సెబీ వద్ద డిసెంబర్ 2022లోనే ముసాయిదా సమర్పించినప్పటికీ ఆగస్టు 2023లో దీనికి సంబంధించిన అనుమతులు వచ్చాయి.
కంపెనీ తన షేర్ల ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో ఏకకాలంలో లిస్టింగ్ చేయాలని నిర్ణయించింది. కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్ లిస్టింగ్ నవంబర్ 10న ఉంటుందని సమాచారం. ఈ కంపెనీని 2016లో భార్యాభర్తలు వరుణ్-గజల్ అలఘ్ కలిసి స్థాపించారు. అయితే 2022లో కంపెనీ యూనీకార్న్ గా గుర్తింపు పొందింది. తాజా ఐపీవో ద్వారా చాలా మంది పెట్టుబడిదారులు కంపెనీలో తమ వాటాలను విక్రయించాలని చూస్తున్నారు. వీరిలో నటి సిల్పా సెట్టి కూడా ఉన్నారు. తాజా ఐపీవోలో కంపెనీ తన ఉద్యోగులకు కోటి రూపాయలు విలువైన షేర్లను రిజర్వ్ చేసింది.
కంపెనీ వ్యాపారం విషయానికి వస్తే.. బ్యూటీ, బేబీకేర్, స్కిన్‌కేర్ ఉత్పత్తులను తయారు చేసి నేరుగా వినియోగదారులకు విక్రయిస్తోంది. క్యూ1 ఎఫ్‌వై24లో కార్యకలాపాల ద్వారా రూ 464.49 కోట్ల ఆదాయాన్ని హోనాస కన్స్యూమర్ నివేదించింది. ఇది ఏడాది క్రితం కాలంలో వచ్చిన ఆదాయం కంటే 49 శాతం అధికం. కంపెనీ ప్రస్తుతం Mamaearth, Aqualogica, Ayuga, BBlunt, The Derma Co బ్రాండ్ల కింద తన ఉత్పత్తులను సేవలను అదిస్తోంది. కంపెనీ ప్రస్తుతం లాభదాయకంగా ముందుకు సాగుతోంది.


Click it and Unblock the Notifications