Malthi Akhilesh: ఏడాదికి రూ.1.06 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించిన టైలర్ కొడుకు..
ప్రతిభ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ యువకుడు. సాధించాలనే తపన ఉంటే పేదరికం అడ్డు కాదని చాటి చెప్పాడు. సంవత్సరానికి కోటి రూపాయల వార్షిక జీతంతో ఉద్యోగం పొందాడు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కుతుకుడుమిల్లికి చెందిన మాల్తి అఖిలేశ్ ఏఐ ఇంజినీర్ గా ఉద్యోగం సాధించాడు. అఖిలేశ్ తండ్రి ఊళ్లలోనే టైలర్ పని చేస్తుంటాడు. చిన్నప్పటి నుంచి నాన్న కష్టం చూసిన అతను మంచి ఉద్యోగం సాధించాలని తపనతో చదువుకున్నారు. విదేశంలో కొలువు పొందాడు. అఖిలేశ్ కు తండ్రి గంగాధర్, తల్లి దేవి ఉన్నారు. గంగాధర్ వినికిడి లోపం ఉండడంతో చదువుకోలేదు.
కుటుంబాన్ని పోషించడానికి ఆయన టైలర్ పని చేయడం mxప్రారంభించారు. భార్య దేవి కూడా కూలీ పనికి వెళ్తూ గంగాధర్ అండగా నిలిచింది. వారిద్దరూ కష్టపడి అఖిలేశ్ ను చదివించారు. కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలని రాత్రింబవళ్లు కష్టపడ్డారు. తల్లిదండ్రుల కష్టం చూసిన అఖిలేశ్ కష్టపడి చదివాడు. అఖిలేశ్ యు కొత్తపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10 తరగతి వరకు చదివాడు. కాకినాడలోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఇంటర్ పూర్తయిన తర్వాత ఈఏపీసెట్ రాసి మంచి ర్యాంకు కొట్టీడప. దీంతో ఇతనికి సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో బీటెక్ సీటు సాధించాడు.

బిటెక్ చదువుతున్నప్పుడే పలు సంస్థల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. మూడు సార్లు ఇంటర్వ్యూలకు వెళ్లినా అతడిని నిరాశే ఎదురైంది. అయితే అఖిలేశ్ బాధపడలేదు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై దృష్టి సారించారు. ఒక ప్రాజెక్టును కూడా రూపొందించి ఔరా అనిపించుకున్నాడు. ఈ సంవత్సరం మే నెలలో ఆదిత్య యూనివర్సిటీలో మరోసారి ప్రాంగణ నియామకాలకు అఖిలేశ్ హాజరయ్యాడు. కెనడాకు చెందిన ఫబ్రంటిక్ ఏఐ కంపెనీ ఇంటర్వ్యూకు వెళ్లాడు. ఈ ఇంటర్వ్యూకు మొత్తం 243 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంత మందిలో అఖిలేశ్ తో పాటు మరో యువకుడు ఉద్యోగం పొందారు.
అఖిలేష్ ప్రతిభను గుర్తించిన కెనడా కంపెనీ అతడికి ఏఐ ఇంజినీర్‌గా ఉద్యోగం ఇచ్చింది. ఏడాదికి ఏకంగా రూ.1.06 కోట్ల భారీ మొత్తాన్ని జీతంగా చెల్లిస్తోంది. జూన్ 20వ తేదీన అధికారికంగా ఆఫర్ లెటర్ ఇచ్చింది. అఖిలేష్ ఇప్పటికే జాబ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఇంటి వద్దే నుంచి పని చేస్తున్నాడు. కంపెనీ నిబంధనల ప్రకారం కంపెనీ మొదటి మూడు నుంచి ఆరు నెలల పాటు నెలకు రూ.30 వేల చొప్పున ఉపకార వేతనం (స్టైపెండ్) చెల్లిస్తుంది. ఆ గడువు ముగిసిన తర్వాత ప్రకటించిన కోటి రూపాయల ప్యాకేజీని పూర్తిస్థాయిలో ఇవ్వనుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications