For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుణాలు చెల్లిస్తా, కేసులు కొట్టేయండి: రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీపై మాల్యా స్పందన

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీపై కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో తన రుణాలు చెల్లిస్తానని, దీనిని పరిగణలోకి తీసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు కేంద్రానికి. తను వంద శాతం రుణాలను చెల్లిస్తానని, తనపై ఉన్న కేసులు మొత్తం క్లోజ్ చేయాలని కోరాడు.3

ప్రపంచ బిగ్గెస్ట్ ప్యాకేజీల్లో.. రూ.20 లక్షల కోట్లు: మోడీ ప్యాకేజీ మ్యాజిక్, 65% ఇప్పటికే ఇచ్చేశారుప్రపంచ బిగ్గెస్ట్ ప్యాకేజీల్లో.. రూ.20 లక్షల కోట్లు: మోడీ ప్యాకేజీ మ్యాజిక్, 65% ఇప్పటికే ఇచ్చేశారు

ఇండియన్ బ్యాంకుల్లో తాను తీసుకున్న రుణాలు 100 శాతం చెల్లిస్తానన్నారు 'కరోనా రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రానికి నా అభినందనలు. వారు కావాలంటే ఎన్ని నోట్లు అయినా ముద్రించగలరు. కానీ ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న 100 శాతం రుణ బకాయిలను చెల్లిస్తానన్న తన అభ్యర్థనను మాత్రం ప్రతిసారి విస్మరించాలా, నేను తీసుకున్న లోన్స్‌కు సంబంధించి డబ్బులు మొత్తం తీసుకొని, నాపై కేసులు కొట్టివేయండి' అని ట్వీట్ చేశాడు.

 Mallya repeats offer to repay loan, links it to Governments Rs 20 lakh crore package

కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఇండియన్ బ్యాంకుల నుండి రూ.9,000 కోట్లు తీసుకొని, ఆ తర్వాత లండన్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. నా రుణాలు అన్నీ తీసుకొని, కేసులు కొట్టివేయాలని ఎప్పటి నుండో కోరుతున్నారు. కానీ బ్యాంకులకు ఎగ్గొట్టి ఇతర దేశాలకు వెళ్లాక, కేసులు పెట్టిన తర్వాత ఇప్పుడు కాళ్లబేరానికి వస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. తప్పు చేసినప్పుడు చట్టపరంగానే ముందుకు వెళ్లాలని కేంద్రం భావిస్తోంది. అందుకే మాల్యాను తిరిగి భారత్ రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

English summary

రుణాలు చెల్లిస్తా, కేసులు కొట్టేయండి: రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీపై మాల్యా స్పందన | Mallya repeats offer to repay loan, links it to Governments Rs 20 lakh crore package

Embattled liquor baron Vijay Mallya, who is fighting against his extradition to India, on Thursday asked the government to accept his offer to repay 100 per cent of his loan dues and close case against him.
Story first published: Thursday, May 14, 2020, 12:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X