మలేరియా వ్యాక్సిన్ ఇప్పుడు మరింత తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోనే తొలి పిల్లల మలేరియా వ్యాక్సిన్ ను కేవలం రూ. 430 కంటే తక్కువకే తీసుకురానున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్..బహుళ జాతి ఫార్మా కంపెనీ జీఎస్‌కే పీఎల్‌సీ రెండు కలిపి సంయుక్తంగా మార్కెట్లోకి ఈ వ్యాక్సిన్ తీసుకురానున్నాయి.
కాగా గతంలో ఈ వ్యాక్సిన్ ధర రూ.859కు అందుబాటులో ఉండేది.తాజాగా ఈ వ్యాక్సిన ను 2028 నాటికి 60శాతం తగ్గింపుతో అందిస్తామని కంపెనీ ప్రకటించింది.పిల్లలకు మలేరియా రాకుండా ముందు జాగ్రత్తగా ఈ వ్యాక్సిన్లు వేస్తారు.ఈ ధర తగ్గింపు వ్యాక్సిన్ ద్వారా చాలా ఎక్కువ మందికి చేరుతుందని ప్రతి సంవత్సరం వేలాది మంది యువ ప్రాణాలను కాపాడుతుందని భావిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏటా ఐదులక్షల మందికిపైగా పిల్లలు మలేరియా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఆఫ్రికా, భారత్ వంటి దేశాలను ఈ మలేరియా కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో పిల్లలకు ముందు జాగ్రత్తగా మలేరియా టీకాను వేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు. కరువుతో అల్లాడుతున్న ఆఫ్రికాలో నిరుపేద దేశాలైన పిల్లలకు తక్కువ ధరకే మలేరియా వ్యాక్సిన్లు అందించేందుకు గవి అనే స్వచ్ఛంద సంస్థ అక్కడ పనిచేస్తోంది. ఈ సంస్థకు వ్యాక్సిన్లు తక్కువ ధరకు సరఫరా చేయడం ద్వారా పిల్లలను మలేరియా బారీ నుండి కాపాడుకోవచ్చని జీఎస్‌కే ప్రతినిధులు చెబుతున్నారు.

భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. జీఎస్‌కే, పాత్ తదితర ఫార్మా కంపెనీలు కలిసి ఆర్‌టీఎస్-ఎస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామన్నారు. ఈ వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం లభించిందని.. ఈ వ్యాక్సిన్ టెక్నాలజీని జేఎస్‌కే.. భారత్ బయోటెక్‌కు బదిలీ చేసిందని తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు అలాగే గవికి సరఫరా చేసేందుకు 2021లోనే ఒప్పందం కుదిరిందని తెలిపారు. వ్యాక్సిన్ల తయారీ, అభివృద్ధి కోసం భారత్ బయోటెక్ 200 మిలియన్ల పెట్టుబడి పెట్టిందని కృష్ణ తెలిపారు. మలేరియాకు గురయ్యే పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చేయడమే మా లక్ష్యమన్నారు.
ఇక జీఎస్‌కే చీఫ్ గ్లోబల్ హెల్త్ ఆఫీసర్ థామస్ బ్రూయర్ మాట్లాడుతూ.. 2021 నుంచి భారత్ బయోటెక్‌తో కలిసి పనిచేస్తున్నామన్నారు. మలేరియాను ఎదుర్కోవడానికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్‌ను మరింత చౌకగా, అందుబాటులో ఉండేలా భారత్ బయోటెక్‌తో కలిసి పనిచేశాం. ఇది మలేరియా నివారణ దిశగా పెద్ద అడుగు అని అన్నారు.
ఇక RTS,S అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు చేసిన తొలి మలేరియా వ్యాక్సిన్.2021లో WHO ఈ వ్యాక్సిన్‌ను వినియోగానికి సిఫారసు చేసింది. అప్పటి నుండి, GSK ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో, తయారీ సాంకేతికతను భారత్ బయోటెక్‌కి బదిలీ చేయడంలో ఎంతో సహకరించింది. ఈ వ్యాక్సిన్ ధర తగ్గింపుతో మలేరియా ప్రభావిత కుటుంబాలకు ఉపయోగమవుతుంది. దీని ద్వారా వ్యాధిని నియంత్రించి, భవిష్యత్తులో పూర్తిగా తొలగించే దిశగా ప్రపంచం ముందుకు సాగుతోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications