భారతీయ డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎం తాజాగా తమ వినియోగదారులను ఉత్సాహపరచే కొత్త రివార్డ్స్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్ కింద వినియోగదారులు చేసే ప్రతి లావాదేవీకి గోల్డ్ కాయిన్స్ లభిస్తాయి. ముఖ్యంగా దసరా, దీపావళి, ధంతేరస్ వంటి పండుగల సీజన్‌లో బంగారం కొనుగోలు సంప్రదాయానికి అనుగుణంగా, పేటీఎం ఈ స్కీమ్‌ను ప్రారంభించింది. పేటీఎం గోల్డ్ కాయిన్ రివార్డ్ ప్రోగ్రామ్ వినియోగదారులకు రోజువారీ లావాదేవీలను ఆస్తులుగా మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. పండుగ సీజన్‌లో బంగారం కొనుగోళ్ల సాంప్రదాయానికి అనుగుణంగా ఈ స్కీమ్ పెద్ద ఎత్తున వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది.
ఇది ఎలా పనిచేస్తుంది?: Paytm యాప్ ద్వారా చేసే స్కాన్ & పే, ఆన్‌లైన్ కొనుగోళ్లు, డబ్బు బదిలీలు, బిల్లులు చెల్లింపులు, రీఛార్జ్‌లు, పునరావృత చెల్లింపులు అన్నీ గోల్డ్ కాయిన్ సంపాదనకు అర్హత పొందుతాయి. ప్రతి ట్రాన్సాక్షన్ విలువలో 1 శాతం గోల్డ్ కాయిన్స్ వస్తాయి. 100 గోల్డ్ కాయిన్స్ కు రూ.1 విలువైన డిజిటల్ గోల్డ్ గా రీడీమ్ చేసుకోవచ్చు. UPI, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసే అన్ని చెల్లింపులకు ఇది లభిస్తుంది. క్రెడిట్ కార్డు లేదా RuPay క్రెడిట్ కార్డ్ ద్వారా UPI పేమెంట్స్ చేస్తే రెట్టింపు గోల్డ్ కాయిన్స్ లభిస్తాయి.

Paytm తెలిపిన వివరాల ప్రకారం..ఈ కార్యక్రమం ప్రధాని మోదీ తీసుకువచ్చిన ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను ప్రతిబింబిస్తుంది. GST ఆధారిత గృహ, వ్యాపార పొదుపులను కూడా డిజిటల్ గోల్డ్ గా మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. భారతీయుల జీవితాల్లో బంగారం ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటుంది. ఇప్పుడు ప్రతి డిజిటల్ చెల్లింపు ఒక శాశ్వత విలువైన ఆస్తిగా మారుతుంది. ఖర్చు చేయడమే కాకుండా, సంపద సృష్టికి కూడా ఇది ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు.
Paytm నుంచి వచ్చిన కొత్త ఫీచర్లు
పునరావృత ఖర్చుల కోసం రిమైండర్స్ (ఉదా: ట్యూషన్ ఫీజు, బిల్లులు).
నెలవారీ ఖర్చు సారాంశం
వ్యక్తిగతీకరించిన UPI IDలు (ప్రైవసీ కోసం)
UPI స్టేట్‌మెంట్‌లు (ఎక్సెల్ లేదా పీడీఎఫ్‌లో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం)
హోమ్ స్క్రీన్ విడ్జెట్‌గా Receive Money.
UPI లింక్డ్ బ్యాంక్ ఖాతాల మొత్తాల ఏకీకృత వీక్షణ
గోల్డ్ కాయిన్స్‌ను రియల్ గోల్డ్‌గా ఎలా మార్చుకోవాలి?
1. Paytm యాప్ ఓపెన్ చేసి 'Gold Coins' విడ్జెట్ ఎంచుకోండి.
2. మీరు సంపాదించిన గోల్డ్ కాయిన్ బ్యాలెన్స్ చూడండి.
3. బ్యాలెన్స్ 1,500 కాయిన్స్ చేరుకున్న తర్వాత 'Convert to Real Gold' అనే ఆప్షన్ వస్తుంది.
4. 100 గోల్డ్ కాయిన్స్ .. రూ.1 విలువైన డిజిటల్ గోల్డ్ గా మారుతుంది.
Paytm డిజిటల్ గోల్డ్ అంటే ఏమిటి?: ఇది MMTC-PAMP భాగస్వామ్యంతో అందించే 24K 99.99% స్వచ్ఛమైన బంగారం. వినియోగదారులు రూ. 1 నుండి బంగారం కొనుగోలు, నిల్వ, విక్రయం ఇక్కడ చేయవచ్చు. బంగారం భౌతికంగా కాకుండా భద్రమైన వాల్ట్‌లలో ఎలక్ట్రానిక్‌గా నిల్వగా చేయడం జరుగుతుంది.
పెట్టుబడి ఎలా పెట్టాలి.
యాప్‌లో "Gold" సెర్చ్ చేసి, రూ.లో లేదా గ్రాములలో మొత్తాన్ని ఎంచుకుని కొనుగోలు చేయాలి.
SIP ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
UPI, డెబిట్/క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
కొనుగోలు పూర్తయ్యాక SMS, ఇమెయిల్ ద్వారా నిర్ధారణ వస్తుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications