ఆపిల్ తన ఉత్పత్తుల తయారీ వ్యూహంలో కీలక మార్పులు చేస్తోంది. ముఖ్యంగా ఐఫోన్ తయారీకి భారతదేశాన్ని ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతోంది. కుపెర్టినోకు చెందిన ఈ టెక్ దిగ్గజం 2025 సంవత్సరంలో భారతదేశం నుంచి 50 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఐఫోన్‌లను భారత్ నుండి ఎగుమతి చేసినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా ధృవీకరించారు. ఇది భారతదేశంలోని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఒక చారిత్రక మైలురాయిగా పరిగణించబడుతోంది.
సోషల్ మీడియా వేదిక Xలో అశ్విని వైష్ణవ్.. ఎకనామిక్ టైమ్స్ కథనాన్ని ఫేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. భారతదేశం నుంచి ఆపిల్ ఐఫోన్ ఎగుమతులు 50 బిలియన్ డాలర్లను దాటాయని ఆయన తెలిపారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.4.51 లక్షల కోట్లకు సమానం. ప్రధాని నరేంద్ర మోడీ 'మేక్ ఇన్ ఇండియా' దృష్టికి ఇది ఒక గొప్ప విజయంగా నిలుస్తోంది. ఉత్పత్తిదారు ఆర్థిక వ్యవస్థగా మారాలనే మా లక్ష్యంలో ఆపిల్ కీలక పాత్ర పోషిస్తోందని వైష్ణవ్ పేర్కొన్నారు.

నివేదికల ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లోనే ఆపిల్ భారతదేశం నుంచి సుమారు 16 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లను రవాణా చేసింది. ప్రస్తుతం ఆపిల్ భారత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుల్లో ఒకటిగా మారింది. ఈ పెట్టుబడుల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 3.5 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడినట్లు అంచనా.
ఆపిల్ 2022లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్‌ఫోన్ ప్రొడక్షన్ లింక్డ్ ఇనిషియేటివ్ (PLI) పథకంలో చేరింది. ఈ పథకం భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ వేగంగా పెరగడానికి కీలకంగా మారింది. ఆపిల్‌తో పాటు శామ్‌సంగ్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలు కూడా భారతదేశాన్ని తయారీ కేంద్రంగా ఎంచుకున్నాయి. 2021 నుంచి 2025 మధ్య కాలంలో శామ్‌సంగ్ సుమారు 17 బిలియన్ డాలర్ల విలువైన పరికరాలను ఎగుమతి చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం భారతదేశంలో ఐదు ఐఫోన్ తయారీ యూనిట్లు ఉన్నాయి. వీటిలో మూడు టాటా గ్రూప్ నిర్వహిస్తుండగా, రెండు ఫాక్స్‌కాన్ నిర్వహిస్తోంది. వీటికి అనుబంధంగా అనేక MSMEలు సహా దాదాపు 45 కంపెనీలతో కూడిన విస్తృత సరఫరా గొలుసు పనిచేస్తోంది. అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం.. గత 11 సంవత్సరాల్లో భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి ఆరు రెట్లు పెరిగింది. అదే సమయంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు ఎనిమిది రెట్లు పెరగడం విశేషం.
ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు దేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అయ్యే టాప్ మూడు వస్తువులలో ఒకటిగా నిలిచాయి.ఈ రంగం కేవలం స్మార్ట్‌ఫోన్‌లకే పరిమితం కాకుండా, ల్యాప్‌టాప్‌లు, సర్వర్లు, హియరబుల్ డివైస్‌లు మరియు 46 కాంపోనెంట్ తయారీ ప్రాజెక్టుల వరకు విస్తరించిందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది నాలుగు సెమీకండక్టర్ ప్లాంట్లు వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications