Year Ender 2023: ఈ ఏడాది దుమ్ముదులిపే లాభాలందించిన స్టాక్స్.. మీ దగ్గర ఉన్నాయా..
Stock Returns: NSEలోని 82 శాతం స్టాక్‌లు డిసెంబర్ 19, 2023 వరకు పెట్టుబడిదారులకు సానుకూల రాబడిని అందించాయి. ఫలితంగా బెంచ్‌మార్క్ నిఫ్టీ 18 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 46 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 42 శాతం మేర ర్యాలీని నమోదు చేశాయి.
ఈ సంవత్సరపు టాప్ గెయినర్స్ విషయానికి వస్తే జై బాలాజీ ఇండస్ట్రీస్ షేర్లు గత ఏడాది డిసెంబర్ 30న రూ.54.70గా ఉండగా తాజాగా 1,291 శాతంతో రూ.761.05కు చేరుకుంది. తర్వాతి స్థానాల్లో S&S పవర్ స్విచ్‌గేర్ 616 శాతం, గీకే వైర్స్ 544 శాతం, ఆరియన్‌ప్రో సొల్యూషన్స్ 501 శాతం, ఐనాక్స్ విండ్ ఎనర్జీ 398 శాతం, సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ 384 శాతం, థామస్ స్కాట్ 371 శాతం, టిటాగర్ రైల్‌సిస్టమ్స్ 369 శాతం, JITF ఇన్‌ఫ్రాలాజిస్టిక్స్ 363 శాతం, ఆషాపురా మినెకెమ్ 351 శాతం, ఎయిమ్‌కో ఎలికాన్ 395 శాతం వృద్ధి చెందాయి.

రాబోయే 12 నెలల్లో నిఫ్టీ50 ఇండెక్స్‌లో పరిమిత అప్‌సైడ్ సంభావ్యతను చూస్తుందని HDFC సెక్యూరిటీస్ బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. తర్వాతి కాలంలో లార్జ్ క్యాప్ బ్యాంకులు, పారిశ్రామిక, రియల్ ఎస్టేట్, పవర్, ఆటో, ఫార్మా, OMCలు, గ్యాస్, క్యాపిటల్ మార్కెట్‌ల వంటి రంగాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారని తెలుస్తోంది.
జాబితాలోని ఇతర 267 స్టాక్‌లు కూడా 2023లో ఇప్పటివరకు 100 శాతానికి పైగా ర్యాలీ చేశాయని డేటా వెల్లడించింది. జిందాల్ సా, HBL పవర్ సిస్టమ్స్, జెన్ టెక్నాలజీస్, యూనిటెక్, GE T&D ఇండియా, అపోలో మైక్రో సిస్టమ్స్, న్యూక్లియస్ సాఫ్ట్‌వేర్, న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్, ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్, ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్, పెనిన్సులా ల్యాండ్, ఎస్సార్ షిప్పింగ్, ఐనాక్స్ విండ్, ఎలక్ట్రోథర్మ్, REC, పటేల్ ఇంజినీరింగ్, కేన్స్ టెక్నాలజీ ఇండియా, ఆనంద్ రాఠీ వెల్త్, పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్, జుపిఎమ్‌ఎల్‌ఎల్ వ్యాగన్స్, ఇండో టెక్ ట్రాన్స్‌ఫార్మర్స్, సుజ్లాన్ ఎనర్జీ కంపెనీలు సైతం 250-350 శాతం మేర ఏడాది ప్రాతిపధిన ఇన్వెస్టర్లకు రాబడిని అందించాయి.


Click it and Unblock the Notifications