Stock Alert: ఈ స్టాక్ ధర 45% తగ్గొచ్చు..! 10 మంది నిపుణులు హెచ్చరిక, మీ దగ్గర కూడా ఉందా..?

Dixon Technologies: దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం బుల్ జోరును కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త జీవితకాల గరిష్ఠాలను తాకిన తర్వాత నిలదొక్కుకునే క్రమంలో స్వల్ప ఒడిదొడుకులకు గురవుతున్న సంగతి తెలిసిందే. బ్రోకరేజ్ సంస్థలు సైతం ఇలాంటి పరిస్థితుల్లో షేర్లకు తమ అభిప్రాయాలను ప్రకటిస్తున్నాయి.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది డిక్సన్ టెక్నాలజీస్ కంపెనీ షేర్ల గురించే. నేడు ఇంట్రాడేలో స్టాక్ ధర 2 శాతం వృద్ధితో రూ.12,195కి చేరుకుంది. ఈ క్రమంలో బ్రోకరేజ్ సంస్థ కంపెనీ రేటింగ్‌ను 'అవుట్‌పెర్ఫార్మ్' నుంచి 'హోల్డ్'కి తగ్గించింది. అలాగే నిన్న త్రైమాసిక ఫలితాల తర్వాత బ్రోకరేజ్ సంస్థ CLSA డిక్సన్ టెక్నాలజీస్ లిమిటెడ్‌పై డౌన్‌గ్రేడ్‌ను జారీ చేసింది. ఈ క్రమంలో మునుపటి టార్గెట్ ధర రూ.9,000ని ప్రస్తుతం రూ.11,400కి పెంచింది. అలాగే మరో ప్రముఖ బ్రోకరేజ్ గోల్డ్‌మన్ సాచ్స్ కంపెనీ షేర్లు రానున్న కాలంలో 43 శాతం పతనాన్ని చూడొచ్చని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ క్రమంలో టార్గెట్ ధరను రూ.6,740గా ఉంచుతూ షేర్లకు SELL రేటింగ్ అందించింది.

Majority brokerages expecting Dixon Technologies share price falls Know details

ఈ క్రమంలో ప్రస్తుతం డిక్సన్ టెక్నాలజీస్‌ షేర్లను కవర్ చేస్తున్న 29 మంది విశ్లేషకుల్లో 14 మంది కంపెనీ షేర్లకు BUY రేటింగ్ ఇవ్వగా, ఐదుగురు మాత్రం షేర్లకు హోల్డ్ రేటింగ్ సిఫార్సు చేస్తున్నారు. అలాగే మిగిలిన 10 మంది మాత్రం కంపెనీ షేర్లకు SELL రేటింగ్ ఇచ్చారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన రెట్టింపు అయ్యింది. దీనిని పరిగణిస్తున్న ఎక్కువ మంది రానున్న కాలంలో కంపెనీ జోరు ఇలాగే కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

కంపెనీ వ్యాపారంపై బ్రోకరేజ్ CLSA అభిప్రాయాన్ని పరిశీలిస్తే.. కంపెనీ ఇప్పటికే ఉన్న కాంట్రాక్టులు పెరగటంతో పాటు కొత్త కస్టమర్‌లు జోడించబడుతున్నందున సమీప కాలంలో మొబైల్ ఫోన్‌లు ప్రధానాంశంగా ఉంటాయని అంచనా వేస్తోంది. ఐటీ హార్డ్‌వేర్, మొబైల్ కాంపోనెంట్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ రంగాల్లోకి ప్రవేశించడం ద్వారా డిక్సన్ బలమైన మధ్యకాలిక వృద్ధికి కూడా సిద్ధమవుతోందని వెల్లడించింది. వీటి ఆధారంగా ఇన్వెస్టర్లు ప్రస్తుతం తమ పోర్ట్ ఫోలియోల్లో ఉన్న కంపెనీ షేర్లపై నిర్ణయాలు తీసుకోవచ్చు.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor Telugu GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+