ఢిల్లీ: ఉద్దేశ్యపూర్వకంగా బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన వారి జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎట్టకేలకు విడుదల చేసింది. ఇంగ్లీష్ పత్రిక ది వైర్ ఈ ఏడాది మే నెలలో ఆర్టీఐ చట్టం కింద ఈ జాబితా కోసం దరఖాస్తు చేసుకుంది. 2019 ఏప్రిల్ 30వ తేదీ వరకు గడువు దాటిన 30 మంది పెద్ద రుణ ఎగవేతదారుల జాబితాను విడుదల చేసింది. దాదాపు పదేళ్లుగా ఈ జాబితా విడుదలకు ఆసక్తి చూపని ఆర్బీఐ ఎట్టకేలకు విడుదల చేసింది.

జాబితా విడుదల చేసిన ఆర్బీఐ...
దేశ ఆర్థిక ప్రయోజనాలకు ఇది వ్యతిరేకమని, అందుకే తాము ఎగవేతదారుల పేర్లు వెల్లడించలేమని ఇప్పటి వరకు ఆర్బీఐ చెబుతూ వచ్చింది. మరోవైపు బ్యాంకులు ఎగవేతదారులపై కేసులు నమోదు చేస్తున్నాయి. బ్యాంకుల వల్ల ఎగవేతదారుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఆర్బీఐ జాబితాను బయట పెట్టింది.

మాల్యా, చోక్సీ కంపెనీలు
ఆర్బీఐ విడుదల చేసిన ముప్పై మంది జాబితాలో వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ, కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా తదితరుల కంపెనీలు ఉన్నాయి. చోక్సీకి చెందిన మూడు కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకు ఇచ్చిన రుణాల విలువ మొత్తం రూ.50వేలకోట్లు దాటింది. బ్యాంకులు రద్దు చేసినవి కలుపుకొని ఈ మొత్తం దాటింది.

కేంద్రీకృత బ్యాంకింగ్
ఈ డేటాను కేంద్రీకృత బ్యాంకింగ్ సమాచారం ది సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్ నుంచి తీసుకొని విడుదల చేసింది. ఇందులో రూ.5 కోట్లకు పైగా రుణం తీసుకున్న వారి సమాచారం ఉంటుంది. 2018లో ట్రాన్స్ యూనియన్ సిబిల్ లెక్కల ప్రకారం 2018లో 11,000 కంపెనీలు చెల్లించాల్సిన మొత్తం రూ.1.61 లక్షల కోట్లకు సమానం.

జాబితాలో వీరు...
రుణ ఎగవేతదారుల జాబితాలో...
గీతాంజలి జెమ్స్,
రేయ్ఆగ్రో లిమిటెడ్,
విన్ సమ్ డైమండ్స్ అండ్ జ్యువెల్లరీ లిమిటెడ్,
రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్,
రోటోమాక్ గ్లోబల్ ప్రయివేటు లిమిటెడ్,
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్,
కుదోస్ కెమికల్స్ లిమిటెడ్,
జూమ్ డెవలపర్స్,
దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్
ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్
ఫరెవర్ ప్రిసీయస్ జ్యువెల్లర్స్ అండ్ డైమండ్స్
సూర్య వినాయక ఇండస్ట్రీస్ లిమిటెడ్
ఎస్ కుమార్స్ నేషన్ వైడ్ లిమిటెడ్
గిలి ఇండియా లిమిటెడ్
సిద్ది వినాయక లాజిస్టిక్స్ లిమిటెడ్
వీఎంసీ సిస్టమ్ లిమిటెడ్
గుప్తా కోల్ ఇండియా
నక్షత్ర బ్రాండ్స్ లిమిటెడ్
ఇండియన్ టెక్నాలీస్ కంపెనీ లిమిటెడ్
శ్రీ గణేష్ జ్యువెల్లర్ హౌస్ లిమిటెడ్
జైన్ ఇన్ఫ్రా ప్రాజెక్టు లిమిటెడ్
సూర్య ఫార్మాస్యూటికల్ లిమిటెడ్
నకోడా లిమిటెడ్
కేఎస్ ఆయిల్స్ లిమిటెడ్
కోస్టల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్
హానుంగ్ టాయ్స్ అండ్ టెక్స్ట్ టైల్స్ లిమిటెడ్
ఫస్ట్ లీజింగ్ కో ఆఫ్ ఇండియా లిమిటెడ్
కాన్కాస్ట్ స్టీల్ అండ్ పవర్
యాక్షన్ ఇస్పాట్ అండ్ పవర్ ప్రయివేటు లిమిటెడ్
డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్..వంటివి ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications