ఏపీ ఆర్థిక రాజధానిగా పేరు గాంచిన విశాఖపట్నం రియల్ ఎస్టేట్ రంగం కీలకమైన మలుపు వద్ద నిలిచింది. రాబోయే కాలంలో వేగవంతమైన వృద్ధి దశలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉందని క్రెడాయ్ విశాఖపట్నం చైర్మన్ వి. ధర్మేందర్ తెలిపారు.
గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థల పెట్టుబడులు, ఏవియేషన్ సిటీ వంటి మెగా ప్రాజెక్టులపై ఇటీవల జరిగిన ప్రకటనలు విశాఖపట్నంలో నివాస, వాణిజ్య రియల్ ఎస్టేట్ డిమాండ్‌ను గణనీయంగా పెంచాయని పేర్కొన్నారు. ఈ సానుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా డిసెంబర్ 19 నుంచి 21 వరకు 11వ క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్‌పోను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ హాజరుకానుండగా, డిసెంబర్ 21న జరిగే ముగింపు కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.

నిరంతర పెట్టుబడులు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక మౌలిక ప్రాజెక్టులు, అలాగే ప్రాంతీయ ఆర్థిక మండలికి ప్రధాన కేంద్రంగా విశాఖపట్నం ఎదుగుతున్న పాత్ర ఈ మార్పుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయని తెలిపారు. ఇవన్నీ కలిపి 2047 విజన్‌కు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, పర్యాటకం, స్వచ్ఛమైన పరిశ్రమలు వంటి రంగాల్లో సమతుల్య అభివృద్ధికి దారితీస్తాయని చెప్పారు.
ప్రస్తుతం విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. నగర విస్తరణ, ఐటీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కలిసి కొన్ని ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా మార్చాయి. ముఖ్యంగా నగర ఉత్తర భాగం ఈ బూమ్‌కు కేంద్రబిందువుగా మారింది. మధురవాడ ప్రాంతం ఇప్పుడు విశాఖ real estate వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా నిలుస్తోంది.
ఐటీ కారిడార్‌గా గుర్తింపు పొందిన ఈ ప్రాంతంలో గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థల పెట్టుబడులు నివాస, కమర్షియల్ ప్రాజెక్టులకు భారీ డిమాండ్ తీసుకొచ్చాయి. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లు, విల్లాలు, రెంటల్ హౌసింగ్‌కు ఇక్కడ మంచి స్పందన ఉంది. సిటీకి అనుసంధానం మెరుగ్గా ఉండటంతో పాటు భవిష్యత్ విస్తరణకు అవకాశం ఉండటమే మధురవాడను ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా మారుస్తోంది.
మధురవాడకు ఆనుకుని ఉన్న వెండాడ, కొమ్మడి ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి నివాస ప్రాంతాలుగా మంచి పేరు సంపాదించుకుంటున్నాయి. స్కూల్స్, హాస్పిటల్స్, ఐటీ కార్యాలయాలకు సమీపంలో ఉండటంతో మధ్యతరగతి కుటుంబాలు, ఐటీ ఉద్యోగులు ఇక్కడ ఇళ్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ధరలు ఇప్పటికీ అందుబాటులో ఉండటం వల్ల దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇవి అనుకూలంగా మారాయి.
సముద్రతీరానికి సమీపంగా ఉన్న రుషికొండ ప్రాంతం ప్రీమియం రియల్ ఎస్టేట్‌కు కేంద్రంగా మారుతోంది. బీచ్ వ్యూ అపార్ట్‌మెంట్లు, హైఎండ్ విల్లాలు, లగ్జరీ ప్రాజెక్టులకు ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంది. పర్యాటక రంగం అభివృద్ధి, ఐటీ సంస్థల సమీపం వల్ల ఈ ప్రాంతంలో ధరలు వేగంగా పెరుగుతున్నాయి.
ఇది ప్రధానంగా హై ఇన్కమ్ గ్రూప్ కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. అలాగే పీఎం పాలెం, ఆనందాపురం ప్రాంతాలు 'వాల్యూ ఫర్ మనీ' జోన్లుగా ఎదుగుతున్నాయి. జాతీయ రహదారి కనెక్టివిటీ, భవిష్యత్ సిటీ విస్తరణ దృష్ట్యా ఈ ప్రాంతాల్లో ప్లాట్లు, అపార్ట్‌మెంట్లకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ప్రస్తుతం ధరలు తక్కువగా ఉన్నప్పటికీ రాబోయే సంవత్సరాల్లో మంచి రాబడులు వచ్చే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దక్షిణ విశాఖలోని గాజువాక ప్రాంతం ఇండస్ట్రియల్ హబ్‌గా ఉండటంతో ఇక్కడ నివాస అవసరాలు ఎప్పటికీ స్థిరంగా ఉన్నాయి. స్టీల్ ప్లాంట్, పోర్ట్ ఆధారిత పరిశ్రమల కారణంగా ఉద్యోగుల కోసం హౌసింగ్ డిమాండ్ కొనసాగుతోంది. మధ్యస్థ ధరల ఇళ్లకు ఇక్కడ మంచి మార్కెట్ ఉంది.
అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్ట్ కారణంగా భోగాపురం పరిసర ప్రాంతాలు భవిష్యత్ రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయి. ప్రస్తుతం ప్లాట్లపై ఎక్కువ ఆసక్తి కనిపిస్తుండగా, విమానాశ్రయం పూర్తి అయిన తర్వాత నివాస, కమర్షియల్ అభివృద్ధి వేగం పుంజుకునే అవకాశముంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Bengaluru: బెంగళూరు రియల్ ఎస్టేట్ 2026.. ఏ ఏరియాలో ధర ఎంత? పూర్తి వివరాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications