IT News: గడచిన వారం టెక్ కంపెనీలకు అస్సలు కలిసిరాలేదనే చెప్పుకోవాలి. దేశంలోని అగ్ర ఐటీ సేవల కంపెనీలు స్టాక్స్ భారీగా నష్టపోయాయి. అయితే దీనంతటికీ కారణం యాక్సెంచర్ చేసిన ప్రకటనగా తెలుస్తోంది.
దేశంలోని టాప్-5 టెక్ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్సీఎల్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.19,000 కోట్లు ఆవిరైంది. ప్రస్తుత గ్లోబల్ పరిస్థితుల కారణంగా FY23 వృద్ధి అంచనాలను యాక్సెంచర్ తగ్గించింది. నాలుగో త్రైమాసికంలో అది కేవలం 2-6 శాతానికి పరిమితం అవుతుందని పేర్కొంది. ఇటీవల ఆదాయాలు, మార్జిన్లతో పాటు డిమాండ్ తగ్గుదలపై జాగ్రత్తగా ఉండాలంటూ కాగ్నిజెంట్, EPAM, Coforge, HCL చేసిన కామెంట్లతో సమీప భవిష్యత్తుపై యాక్సెంచర్ ఆందోళన వ్యక్తం చేసింది.

అలాగే FY25లో డిమాండ్ పుంజుకుంటుదని ఆశించటం ఆలోచించటం రిస్క్ తో కూడుకున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత రెండేళ్ల కాలం తర్వాత చిన్న డీల్స్, ద్రవ్యోల్బణం వల్ల వ్యయాలపై జాగ్రత్తలు వంటి కారణాలతో టెక్ కంపెనీ యాక్సెంచర్ ఆందోళన చెందుతోంది. ఇండియన్ ఐటీ కంపెనీలు సైతం ఇదే మందగమనాన్ని చూడవచ్చి తెలుస్తోంది. ప్రధాన మార్కెట్ అయిన అమెరికాలో బలహీనతలు ఐటీ కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.
ఈ క్రమంలో బీఎస్ఈలో టీసీఎస్ స్టాక్ 0.92 శాతం క్షీణించి రూ.3,209 కనిష్ఠ స్థాయికి చేరుకుంది. రెండో స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్ 1.36 శాతం క్షీణించి రూ.1,265.15 వద్ద కనిష్ఠ స్థాయికి పడిపోయింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 1.04 శాతం క్షీణించి రూ.1,151.15కి చేరుకుంది. ఇక విప్రో స్టాక్ 1 శాతం క్షీణించి రూ.378.10కి చేరుకోగా.. టెక్ మహీంద్రా షేర్లు 2.28 శాతం మేర క్షీణించి రూ.1,094.10కి చేరుకున్నాయి. ఈ ఐదు కంపెనీల మార్కెట్ క్యాప్ గురువారం ముగింపు నాటికి రూ.19,168.70 కోట్లు తగ్గి రూ.23,32,827 కోట్లకు చేరుకుంది.
ఇదే క్రమంలో ప్రఖ్యాత నొమురా ఇండియా భారతీయ IT సేవల కోసం ప్రపంచ దేశాల నుంచి డిమాండ్ ఔట్‌లుక్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. FY24లో కంపెనీల అంతటా ఆపరేటింగ్ పనితీరు గణనీయంగా మారుతుందంటూ టెక్ మహీంద్రా, కోఫోర్జ్ లపై సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది. యాక్సెంచర్ ద్వారా ఆదాయ గైడెన్స్‌ను తగ్గించటం.. IT సేవలకు డిమాండ్‌ను తగ్గించడాన్ని సూచిస్తుందని నోమురా అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఐటీ కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నట్లు కనిపిస్తోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications