Stock Market: Sensex, Nifty సూచీల భేజారు.. బుల్ జోరు ముగిసిందా..?
Closing Bell: ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇంట్రాడేలో అదే ధోరణిని కొనసాగించాయి. పరిస్థితులు చూస్తుంటే బుల్ జోరు ముగిసిందా అని అనుమానాలు కలుగుతున్నాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 260 పాయింట్ల, మరో కీలక సూచీ నిఫ్టీ 106 పాయింట్ల మేర నష్టపోయాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 102 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 435 పాయింట్ల మేర నష్టాలతో తమ ట్రేడింగ్ ముగించాయి. అయితే కొందరు నిపుణులు మాత్రం బుల్ రన్ కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు.

వారాతంలో స్మాల్ క్యాప్ సూచీ ఒక శాతానికి పైగా నష్టపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆందోళనకర ఆర్థిక పరిస్థితులతో ఇన్వెస్టర్లు తమ సంపదను ఈక్విటీ మార్కెట్ల నుంచి బాండ్స్ లోకి తరలిస్తున్నారు. అలాగే గ్లోబల్ స్టాక్‌లు మూడు నెలల కంటే ఎక్కువ వారపు అతిపెద్ద క్షీణతకు దారితీశాయి. యూరప్ లో ఈక్విటీలు డిసెంబరు నుంచి వాటి సుదీర్ఘ నష్టాల పరంపరను కొనసాగిస్తున్నాయి. అప్పులు తారాస్థాయికి చేరుకోవటం కూడా ఆందోళనలకు కారణంగా నిలుస్తోంది. ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో, రియల్టీ, ఎఫ్ఎమ్సీజీ, మెటల్ మీడియా రంగాలు అత్యధికంగా నష్టపోయాయి.
ఎన్ఎస్ఈలో మార్కెట్లు ముగిసే సమయానికి ఇండస్ ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్ టెస్, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఆటో, టాటా కన్జూమర్, నెస్లే కంపెనీల షేర్లు లాభాల్లో ముగిసి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, హిందాల్కొ, దివీస్ ల్యాబ్స్, గ్రాసిమ్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, హీరో మోటార్స్, టైటాన్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, యూపీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్ టి, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు నష్టాలతో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications