Stock Market: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు.. రోజంతా ఒడిదొడుకుల్లోనే..
Market Closing: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల్లోనే కొనసాగాయి. ప్రధానంగా ఐటీ, క్యాపిటల్ గూడ్స్ రంగాలు నేడు మార్కెట్లను కిందకు లాగాయి. అయితే మెుత్తానికి స్వల్ప లాభంతో ఫ్లాట్ ముగింపును సూచీలు నమోదు చేశాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 15 పాయింట్ లాభంలో, మరో కీలక సూచీ నిఫ్టీ 0 పాయింట్ల లాభంతో ప్రయాణాన్ని ముగించాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 154 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 267 పాయింట్లు గెయిన్ అయింది. దేశీయ సూచీలు సోమవారం నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించి మిశ్రమ స్పందనతో మార్కెట్‌ను ముగించాయి.

ఎన్ఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్, బజాజ్ ఫిన్ సర్వ్, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా, గ్రాసిమ్, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎన్టీపీసీ, నెస్లే, ఐసీఐసీఐ బ్యాంక్, దివీస్ ల్యాబ్, మారుతీ, బ్రిటానియా, టాటా స్టీల్, ఓఎన్జీసీ, యూపీఎల్ కంపెనీల షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో హిందాల్కొ, ఎస్బీఐ లైఫ్, హీరో మోటార్స్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, విప్రో, హెచ్డీఎఫ్సీ లైఫ్, టీసీఎస్,ఎల్ టిఐఎమ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, సన్ ఫార్మా, ఎస్బీఐ, సిప్లా, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, ఎల్ టి కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications