Mutual Funds: జియో ఐపీఓ యాంకర్ బుక్‌లో పెట్టుబడి పెట్టిన మ్యూచువల్ ఫండ్లు ఇవే..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ మద్దతు ఉన్న రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ 21 అక్టోబర్ 2026 నుండి సబ్స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఐపీఓ పబ్లిక్ సబ్స్క్రిప్షన్ కోసం ప్రారంభమయ్యే ముందు, కంపెనీలు యాంకర్ బుక్ కేటాయింపు ప్రక్రియను పూర్తి చేస్తాయి. 19 అక్టోబర్ 2026 నాటి కేటాయింపుల ప్రాతిపదిక ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్ దాదాు 7.25 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.1,119 చొప్పున యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించడాన్ని ఖరారు చేసింది. యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించిన 7.25 కోట్ల ఈక్విటీ షేర్లలో, 2.49 కోట్ల షేర్లను (మొత్తం యాంకర్ కేటాయింపులో 34.34%) 95 స్కీమ్‌ల ద్వారా 25 దేశీయ మ్యూచువల్ ఫండ్లకు కేటాయించారు. అత్యధిక కేటాయింపులు పొందిన టాప్ 10 మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు ఏంటో తెలుసుకుందాం.
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ యాంకర్ బుక్‌లోని అగ్రశ్రేణి మ్యూచువల్ ఫండ్ పథకాలలో ఎస్బిఐ ఫోకస్డ్ ఫండ్ అత్యధికంగా రూ.315 కోట్ల కేటాయింపును పొందింది. ఆ తర్వాత హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ రూ.132.43 కోట్ల పెట్టుబడి పెట్టగా.. హెచ్‌డిఎఫ్‌సి లార్జ్ క్యాప్ ఫండ్లు రూ.126.33 కోట్లు పెట్టుబడి పెట్టాయి. తర్వాతి స్థానాల్లో నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ రూ.99.9 కోట్లు, నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ రూ.99.9 కోట్లు, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ రూ.94.99 కోట్లు, ఆదిత్యా బిర్లా సన్ లైఫ్ లార్జ్ క్యాప్ ఫండ్ రూ.89.99 కోట్లు, ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ అగ్రేసివ్ హైబ్రిడ్ ఫండ్ రూ.88 కోట్లు, ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ బ్యాలెన్స్ అడ్వాన్స్ డ్ ఫండ్ రూ. 81.99 కోట్లు, ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ మల్టి అసెట్ ఫండ్ రూ.81.99 కోట్లు, ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ వ్యాల్యూ ఫండ్ రూ.81.99 కోట్లు పెట్టుబడి పెట్టాయి.

కేటాయింపు తేదీ నుంచి సగం యాంకర్ షేర్లు 30 రోజుల పాటు లాక్ చేస్తారు. మిగిలిన సగం 90 రోజుల పాటు లాక్ చేస్తారు. ఈ కాలంలో ఫండ్ లాక్-ఇన్ చేయబడిన షేర్లను అమ్మడం లేదా వాటిని మరో స్కీమ్‌కు బదిలీ చేయడం కుదరదు. లాక్-ఇన్ కాలాలు ముగిసిన తర్వాత, ఫండ్ మేనేజర్లు తమ హోల్డింగ్స్‌ను కొనసాగించాలా, అమ్మాలా లేదా పెంచుకోవాలా అని నిర్ణయించుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది.హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 30 సెప్టెంబర్ 2026 నాటికి, దీని నిర్వహణలో ఉన్న రూ.1.09 లక్షల కోట్ల ఆస్తులలో (AUM) రూ.132 కోట్ల కేటాయింపు దాదాపు 0.12%కి సమానం. జియో లిస్టింగ్ ధరలో 20% పెరుగుదల కూడా స్కీమ్ యొక్క NAVకి కేవలం 0.02% మాత్రమే జోడిస్తుంది.
హెచ్‌డిఎఫ్‌సి లార్జ్ క్యాప్ ఫండ్ ఈ ఫండ్‌లో జియో వాటా సుమారు 0.34%. మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో దీనికి ఉన్న 4.76% వాటా మరింత ముఖ్యమైనది. ఎందుకంటే జియో లిస్టింగ్, మార్కెట్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఇచ్చే విలువను ప్రభావితం చేయగలదు. కాగా జియో ఐపీఓకు పెట్టుబడిదారుల నుంచి భారీ డిమాండ్ వచ్చింది. మొదటి రోజే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. ఉదయం 10.40 గంటలకు బీఎస్ఈ లిమిటెడ్ వెబ్సైట్లో ఉన్న డేటా ప్రకారం, మొదటి రెండు గంటల్లోనే ఆఫర్లో ఉన్న 197.5 మిలియన్ల షేర్లను బిడ్లు అధిగమించాయి. సంస్థాగత వాటా 3.25 శాతం, హై నెట్ వర్త్ వాటా 26% సబ్‌స్క్రైబ్ అయ్యాయి. రిటైల్ పెట్టుబడిదారులు తమ కోసం కేటాయించిన షేర్లలో దాదాపు 23 శాతం కోసం బిడ్ చేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications