జూలై 1, 2025 నుంచి కొన్ని ముఖ్యమైన ఆర్థిక నిబంధనలు మారుతున్నాయి. ఇవి మీ బ్యాంకింగ్, టాక్స్ ఫైలింగ్, రైల్వే ప్రయాణం, ఇన్వెస్ట్‌మెంట్, డిజిటల్ పేమెంట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశముంది. అందుకే ముందుగానే అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరం.

కొత్త పాన్ కు ఆధార్ లింకు
ఇకపై జులై 1 నుంచి కొత్త పాన్ కార్డు తీసుకోవాలంటే ఆధార్ నెంబర్ మరియు వెరీఫికేషన్ ని తప్పనిసరి చేశారు. ఇంతకు ముందు అయితే పాన్ కార్డు కోసం ఏదైనా గుర్తింపు కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అవసరం కానీ జులై నుంచి ఒక్క ఆధార్ కార్డు మరియు దానికి లింకు చేసిన ఫోన్ నెంబర్ ని తీసుకొని వెళితే సరిపోతుంది. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం ఒక్క పాన్ కార్డుకు మించి ఉండకూడదు ఒకవేళ ఉండి ఉంటే రూ. 10 వేలు జరిమానా విధిస్తారు.
రైల్వే టిక్కెట్ల బుకింగ్‌పై మార్పులు
జులై 1, 2025 నుంచి ఐఆర్‌సీటీసీ ద్వారా రైల్వే టికెట్ బుకింగ్‌పై కొన్ని కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకుంటేనే టికెట్ ని పొందగలరు. రైల్వే టికెట్ లు బుకింగ్ చేసుకోవాలంటే ఆధార్ వెరీఫికేషన్ otp తప్పనిసరి చేశారు. ఇక తత్కాల్ టికెట్ బుకింగ్ లో కూడా మార్పులు జరిగాయి. జులై 15 నుంచి టికెట్ బుకింగ్ సమయం లో ఆధార్ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తత్కాల్ టికెట్లను ఏజెంట్ల ద్వారా చేసుకునేతట్టు అయితే వారికి తత్కాల్ బుకింగ్ స్టార్ట్ చేసిన 30 నిమిషాల తర్వాతనే వారికి బుకింగ్ చేసుకోవడానికి వస్తుంది. దీనివల్ల టికెట్ బుకింగ్ అవసరమైన వారికి బుక్ అయ్యేలాగా రైల్వే శాఖ ముందుకు తీసుకువచ్చింది. ఇది జులై 15 నుంచి ప్రారంభం కానుంది.
రైల్వే టికెట్ ధరలు పెంపు
రైల్వే శాఖ జులై 1, 2025 నుంచి టికెట్ ధరలను సవరించనుంది. ప్రతి 500 కిలోమీటర్లు దాటాక ప్రతి ఒక యాక్సట్రా కిలోమీటర్ కి ఒక పైసా వర్తిస్తుంది. ఇది ప్రతి సెకండ్ క్లాస్ ట్రైన్ టికెట్ కి వర్తిస్తుంది. మెయిల్/ఎక్స్ ప్రెస్ రైళ్లకి నాన్ ఏసి ప్రయాణానికి కిలోమీటరకు ఒక పైసా, ఏసి కోచ్‌కి 2 పైసలు చొప్పున ధరలు పెంచారు.
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) గడువు పొడిగింపు
ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్ ను జులై నెలలో ఫైల్ చేస్తుంటారు కానీ ఈసారి సెప్టెంబర్ 15 వరకు పొడిగించబడింది. ఈ మార్పుల వల్ల పన్ను చెల్లింపుదారులకు తాత్కాలిక ఊరట కలుగుతుంది.
బ్యాంకింగ్ & ATM ఛార్జీల మార్పులు
జూలై 1, 2025 నుండి బ్యాంకింగ్ & ATM ఛార్జీల్లో కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంకు మరియు ICICI బ్యాంకు వంటి ప్రైవేట్ బ్యాంకులు, ఖాతాదారులకి ఉచితంగా అనుమతించిన ATM విత్‌డ్రాయల్ పరిమితిని మించితే, ప్రతి అదనపు లావాదేవీకి ₹23 ఛార్జ్ విధించనున్నాయి. ఇది నగదు ఉపసంహరణ ఖర్చులను మరింత పెంచే అవకాశం కలిగిస్తుంది. అలాగే HDFC బ్యాంకు రెంటల్ పేమెంట్‌లు, ఆన్‌లైన్ గేమింగ్ చెల్లింపులు, మరియు యుటిలిటీ బిల్లుల చెల్లింపులపై కూడా కొత్తగా 1% ఫీజు అమలు చేస్తుంది. అయితే ఈ ఫీజు గరిష్ఠంగా రూ. 4999 వరకే పరిమితం ఉంటుంది. డిజిటల్ లావాదేవీలలో ఈ కొత్త ఛార్జీల వల్ల ఖాతాదారులు తమ లావాదేవీలపై మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.
క్రెడిట్ కార్డుల ఛార్జీల మార్పులు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు, రివార్డ్ పాయింట్లలో జూలై 1 నుంచి భారీగా మార్పులు అమల్లోకి రానున్నాయి. వాలెట్ లోడింగ్ (రూ. 10వేల కన్నా ఎక్కువ), యుటిలిటీ చెల్లింపులు (రూ. 50వేలు కన్నా ఎక్కువ), ఆన్‌లైన్ గేమింగ్ లావాదేవీలు (రూ. 10వేల కన్నా ఎక్కువ)పై 1 శాతం ఛార్జీని బ్యాంక్ ప్రవేశపెట్టింది.
GST రిటర్న్ ఫైలింగ్ మార్పులు
జూలై1, 2025 నుండి GST వ్యవస్థలో కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. వస్తువులు, సేవల పన్ను నెట్‌వర్క్ (GSTN) ప్రకారం, ఇకపై GSTR-3B ఫారమ్ నాన్ ఎడిటబుల్ గా అందుబాటులో ఉంటుంది . అంటే, జూలై 2025 నుంచి నెలవారీ GST చెల్లింపులకు ఉపయోగించే GSTR-3B ఫారం లో ఎలాంటి మార్పులు చేయలేని విధంగా అందుబాటులో ఉంటుంది. ఈ ఫారంలో పన్ను బాధ్యతలు ఇప్పటికే మీరు GSTR-1, GSTR-1A లేదా IFFలో ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆటోమేటిక్‌గా ఫిల్ అవుతాయి. దీని వల్ల తప్పులు సరిదిద్దే అవకాశం ఉండదు. కావున, GSTR-1 లేదా ఇతర ప్రాథమిక ఫారాల్లో సరిగా, జాగ్రత్తగా వివరాలు ఇచ్చే బాధ్యత పన్ను చెల్లింపుదారుల పైనే ఉంటుంది.
ఇందులోని ప్రతి మార్పును వివరంగా అర్థం చేసుకుని, ముందుగానే సన్నద్ధం అయితే ఖర్చులను తగిన సమయంలో కాపాడుకోవచ్చు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications