IPO News: తొలిరోజే లచ్చిందేవి.. ఐపీవో చిచ్చరపిడుగు లిస్టింగ్ గెయిన్స్..

Platinum Industries IPO: నేడు మార్కెట్లోకి వచ్చిన రెండు ఐపీవోలు ఇన్వెస్టర్లను సంపన్నులుగా మార్చేశాయి. వాస్తవానికి మెయిన్ కేటగిరీలో వచ్చిన ఐపీవోలు లాభాలను అందించటంలో నేడు పోటీ పడ్డాయని చెప్పుకోవచ్చు.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ప్లాటినం ఇండస్ట్రీస్ ఐపీవో లిస్టింగ్ గురించే. నేడు బీఎస్ఈలో కంపెనీ షేర్లు బలమైన ఆరంభాన్ని నమోదు చేశాయి. ఈ క్రమంలో ఒక్కో షేర్ 33 శాతం కంటే ఎక్కువ ప్రీమియం రేటు రూ.228 వద్ద జాబితా అయ్యి మెుదటి రోజే పెట్టుబడిదారులకు సూపర్ లాభాలను అందించింది. అలాగే ఎన్ఎస్ఈలో 31 శాతం కంటే ఎక్కువ ప్రీమియంతో రూ.225 వద్ద జాబితా చేయబడ్డాయి. ఇష్యూ సమయంలో కంపెనీ దరఖాస్తుదారులకు షేర్లను గరిష్ఠ ప్రైస్ బ్యాండ్ ధర రూ.171 వద్ద విక్రయింంది. ఫిబ్రవరి 27న ప్రారంభమైన ఐపీవో ఫిబ్రవరి 29 వరకు పెట్టుబడి అవకాశాన్ని అందించింది.

Main category Platinum Industries IPO made bumper listing with 33 Percent premium on issue price

మార్కెట్‌లో అద్భుతమైన లిస్టింగ్ తర్వాత ప్లాటినం ఇండస్ట్రీస్ షేర్లలో మరింత పెరుగుదల కనిపించింది. లిస్టింగ్ తర్వాత బీఎస్ఈలో షేర్లు 3% కంటే ఎక్కువ పెరిగి రూ.237కి చేరుకున్నాయి. ఎన్ఎస్ఈలో సైతం 3 శాతం కంటే ఎక్కువ పెరుగుదలతో రూ.233 వద్ద కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్ల కోసం లాట్ పరిమాణాన్ని కంపెనీ 87 షేర్లుగా నిర్ణయించింది. ఈ క్రమంలో ఒక లాట్ కొనుగోలుకు వాస్తవానికి రిటైల్ పెట్టుబడిదారులు ఏకంగా రూ.14,877 పెట్టుబడిగా పెట్టారు.

ప్లాటినం ఇండస్ట్రీస్ ఐపీవో మొత్తం 98.99 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. కంపెనీ ఐపీవోలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 50.92 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కేటగిరీ 141.79 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్(QIB) కోటా 151 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ప్లాటినం ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ మొత్తం పరిమాణం రూ.235.32 కోట్లు విజయవంతంగా నేడు పూర్తైంది. ప్రస్తుతం కంపెనీ షేర్లలో బెట్టింగ్ వేసి అలాట్మెంట్ పొందిన ఇన్వెస్టర్లు లాభాలను పొంది సంతోషంలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+