కరోనా మహమ్మారిలో భారత్ మూడో దశకు సమీపంలో ఉంది. మూడు వందల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. పంజాబ్ వంటి రాష్ట్రాలు మరో రెండు రోజుల పాటు దీనిని పొడిగించాలని భావిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు తమకు తోచిన సహాయం చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఆనంద్ మహీంద్రా నేతృత్వంలోని మహీంద్రా గ్రూప్ తమ ఫ్యాక్టరీలలో వెంటిలెటర్లను ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది. కరోనాపై పోరాడే ప్రయత్నంలో భాగంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. మహీంద్రాలో వెంటిలెటర్లు తయారు చేయనున్నామని, అలాగే, మహీంద్రా హాలీడేస్‌లను తాత్కాలిక సంరక్షణ కేంద్రాలుగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

అంతేకాదు, తన 100 శాతం వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం కరోనా ఫండ్‌కు అందించనున్నట్లు తెలిపారు. కేవలం ఈ నెల వేతనమే కాకుండా, మరికొన్ని నెలల పాటు దీనిని అందిస్తానని తెలిపారు. అదే విధంగా ఇతర పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా సహకరించాలని కోరారు. ఇలాంటి కీలక సమయంలో ప్రభుత్వానికి అండగా ఉందామన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications