Mahindra Cars: దీపావళి దగ్గర పడింది. దీంతో దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన వాహనాలపై గరిష్ఠంగా రూ.3.05 లక్షల వరకు తగ్గింపులను ప్రకటించింది.
ప్రస్తుతం కంపెనీ XUV400, XUV300, Bolero, Bolero Neo, Marazzo మోడళ్లపై తగ్గింపులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదే సమయంలో బెనిఫిట్ స్కీమ్ నుంచి XUV700, Scorpio-N, Scorpio Classic, Thar మోడళ్లను ఈనెల అందిస్తున్న ఆఫర్ల నుంచి పక్కన పెట్టినట్లు మహీంద్రా గ్రూప్ ప్రకటించింది. దీంతో కొత్త కారు కొనాలనుకునే వారిలో సంతోషం వెల్లివిరుస్తోంది.
Mahindra XUV400:దేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో నవంబర్ మాసంలో కంపెనీ తన XUV400 అత్యంత ముఖ్యమైన డిస్కౌంట్‌లతో ప్రత్యేకంగా నిలిచింది. ఇదే సెగ్మెంట్‌లోని Tata Nexon EVతో పోటీపడే ఈ ఎలక్ట్రిక్ SUVని కొనుగోలు చేయాలనుకునే వాహన ప్రియులకు వివిధ వేరియంట్లపై రూ.1.5 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. XUV400 టాప్-ఎండ్ E వేరియంట్‌కి అత్యధిక ప్రయోజనం, మిడ్-ట్రిమ్ వేరియంట్ రూ.3 లక్షల ప్రయోజనాన్ని, ఎంట్రీ-లెవల్ EC వేరియంట్ అత్యల్ప ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.

Mahindra XUV300:దీపావళి నెలలో మహీంద్రా గ్రూప్ అతి చిన్న SUV XUV300 వేరియంట్‌పై రూ.1.2 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ప్రయోజనాలు W8, W6 వేరియంట్‌లపై అందుబాటులో ఉంది. టాప్-ఎండ్ W8 వేరియంట్‌కు రూ.95,000, W6 వేరియంట్ రూ.80,000 తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ.25,000 విలువైన మహీంద్రా నుంచి కాంప్లిమెంటరీ అధికారిక స్పేర్స్ కూడా ఉన్నాయి.
Mahindra Bolero, Bolero Neo:మహీంద్రా బొలెరో, బొలెరో నియో SUVలపై రూ.70,000 వరకు తగ్గింపులను కంపెనీ దీపావళి నెలలో అందిస్తోంది. B6 వేరియంట్ రూ.35,000 వరకు, బొలెరో కోసం ఎంట్రీ-లెవల్ B4 వేరియంట్ రూ.50,000 వరకు ప్రయోజనాలతో పాటు అదనంగా రూ.20,000 విలువైన కాంప్లిమెంటరీ యాక్సెసరీస్ కంపెనీ అందిస్తోంది. ఇదే క్రమంలో బోలెరో నియో SUV మూడు వేరియంట్‌లలో రూ. 50,000 వరకు తగ్గింపులను అందిస్తుంది. టాప్-ఎండ్ N10 వేరియంట్‌కు అత్యధిక ప్రయోజనం అందుబాటులో ఉంది. ఇక చివరిగా మహీంద్రా గ్రూప్ తన Marazzo అన్ని వేరియంట్‌లకు వర్తించే మొత్తంలో రూ.58,300 తగ్గింపులను వినియోగదారులకు అందిస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications