Mahindra OJA: దేశీయ ట్రాక్టర్ వ్యాపారంలో మహీంద్రా గ్రూప్ పెద్ద వ్యాపారాన్ని కలిగి ఉంది. నమ్మకానికి, మెరుగైన పనితీరుకు ఇవి పెట్టిన పేరు. కఠినమైన వ్యవసాయ భూముల్లో సైతం భాగా పనిచేస్తాయని చాలా మంది రైతన్నలు చెబుతుంటారు.
ఆగస్టు 15, 2023 దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ మహీంద్రా గ్రూప్ నుంచి అతిపెద్ద ప్రకటన వెలువడింది. మహీంద్రా ట్రాక్టర్స్ దక్షిణ ఆఫ్రికాలోని కేప్ టౌన్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో ఫ్యూచర్‌స్కేప్‌లో 'ఫ్యూచర్-రెడీ' ట్రాక్టర్ల శ్రేణిని ఆవిష్కరించింది. వీటికి Mahindra OJA అని పేరుపెట్టింది. ఇవి నాలుగు చక్రాలతో నడిచే లైట్ వెయిట్ ట్రాక్టర్లు. డిజైన్ & ఇంజనీరింగ్‌లో ట్రాన్స్‌ఫార్మేటివ్ మార్పును తీసుకొస్తూ.. ట్రాక్టర్ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణను తీసుకొస్తోంది.

4WD స్టాండర్డ్‌తో, మహీంద్రా కాంపాక్ట్ మరియు స్మాల్ యుటిలిటీ ప్లాట్‌ఫారమ్‌లలో భారత మార్కెట్ కోసం 7 కొత్త ట్రాక్టర్ల మోడళ్లను విడుదల చేసింది. ఈ మోడల్‌లు 20HP-40HP(14.91kW - 29.82kW) శక్తిని కలిగి ఉంటాయి. వీటిని అనేక రకాల వ్యవసాయ పనులకు వినియోగించుకోవచ్చని మహీంద్రా గ్రూప్ వెల్లడించింది. ప్రగతిశీల రైతులను లక్ష్యంగా చేసుకుని కొత్త కొత్త OJA ట్రాక్టర్ల శ్రేణిని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు మహీంద్రా & మహీంద్రా ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా వెల్లడించారు. ఇది నిజంగా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పుల పట్ల తమ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.
కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం వీటి ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.5.64 లక్షల నుంచి ఉంటుందని వెల్లడైంది. తాజాగా కంపెనీ తీసుకొచ్చిన కొత్త మోడల్ ట్రాక్టర్లు ప్రపంచంలోని 25 శాతం మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏషియన్, యూరోపియన్ మార్కెట్లలోకి అడుగుపెట్టేందుకు ఇవి కంపెనీకి దోహదపడతాయని మెుబిలిటీ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీ PROJA, MYOJA, ROBOJA అనే మూడు అడ్వాన్స్ టెక్నాలజీలతో లైట్ ట్రాక్టర్లను అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే వీటిని ప్రపంచ వ్యాప్తంగా వివిధ మార్కెట్లలో అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ ప్రకటించింది.


Click it and Unblock the Notifications