హైదరాబాద్: సోషల్ మీడియా వచ్చిన తర్వాత వివిధ రంగాలలోని వారికి అడ్వర్టయిజ్‌మెంట్ కాస్త ఈజీ అయిపోయిందనే చెప్పాలి. ఎవరైనా సెలబ్రిటీ ఎక్కడకైనా వెళ్లి 'సూపర్' అని ఒక పోస్ట్ పెడితే చాలు అవి అందరి దృష్టిలో పడతాయి. అది టూరిస్ట్ పేల్స్ కావొచ్చు, షాపింగ్ కాంప్లెక్స్ కావొచ్చు, వస్తువు కావొచ్చు... కాస్త ప్రముఖ వ్యక్తి ఎవరైనా పోస్ట్ పెడితే దానికి అంతో ఇంతో ప్రచారం జరిగినట్లే. హీరో, హీరోయిన్లు, వారి ఫ్యామిలీ మెంబర్స్ అలాంటి పోస్టులు పెడితే ఆ క్రేజ్ ఇక ఆ క్రేజ్ వేరే విధంగా ఉంటుంది.

మహేష్ బాబు సతీమణి రాజు గారి తోట
తాజాగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఆమె ఓ రెస్టారెంట్లో లంచ్ చేసి ఇందుకు సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఆ రెస్టారెంట్ పేరు 'రాజు గారి తోట'. ఇది హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పైన ఉంటుంది. ఈ రోడ్డులో ప్రయాణించే వారికి ఇది సుపరిచితం. ఎంతోమంది అక్కడ భోజనం చేస్తుంటారు. మంచి వాతావరణంలో నిర్మించిన ఈ రెస్టారెంట్ రుచికరమైన భోజనాన్ని అందిస్తోంది.

జగన్ సతీమణిని కలిసేందుకు వెళ్తూ....
మహేష్ బాబు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వివరాలు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతికి తెలియజేసేందుకు నమ్రతా విజయవాడ వెళ్లారు. హైదరాబాద్ - విజయవాడ హైవే ప్రయాణంలో నమ్రతా రాజుగారితోట రెస్టారెంటులో భోజనం చేసారు. ఆమె కూడా ఇక్కడి భోజనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.
నమ్రత పోస్ట్
రెండు రోజుల క్రితం నేను విజయవాడకు వెళ్లిన సమయంలో 'రాజు గారి తోట' రెస్టారెంటుకు వెళ్లానని, ఇక్కడ మంచి ఆంధ్రా భోజనం తిన్నానని, ఘుమఘుమలాడే తందూరీ చాయ్ తాగానని, చివరగా మీనాక్షి పాన్ తీసుకున్నానని నమ్రతా ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో నేను చేసిన అద్భుతమైన భోజనం ఇది అన్నారు. మీరు కూడా ఇక్కడ రుచి చూడండని, నాకు చాలా నచ్చింది అని చెప్పారు.

ఈ రెస్టారెంట్ ఎవరిదంటే?
ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఉంది. యాదృచ్చికం కావొచ్చు కానీ నమ్రతా శిరోద్కర్ భోజనం చేసిన ఆ రాజు గారి తోట రెస్టారెంట్ ఓనర్ అనిల్ సుంకర అని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అయితే మొత్తానికి నమ్రత పెట్టిన పోస్ట్ బిజినెస్ పెరగడానికి కూడా దోహదపడవచ్చు. ఆమె పోస్టుకు చాలామంది అభిమానులు స్పందిస్తూ.. తప్పకుండా, ఈసారి అక్కడ టేస్ట్ చేస్తామని పేర్కొన్నారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications