Dhoni: భారతీయులు అత్యంత ఎక్కువగా అభిమానించే ఆట క్రికెట్. ఈ క్రీడకు సంబంధించిన మాజీ, ప్రస్తుత ప్లేయర్స్ అంటే ఎనలేని గౌరవం, ఆదరణ ఉంది. దీంతో వారిని తమ బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకుని.. తమ సేవలు లేదా ఉత్పత్తులను ప్రచారం చేసుకోవాలని వివిధ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కంటి ఆస్పత్రి మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ.. ఓ క్రికెటర్ ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. భారత దిగ్గజ క్రికెటర్, క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఇందుకు ఎంచుకున్నట్లు ప్రకటించింది.

'విశ్వసనీయత మరియు శ్రేష్ఠతకు ధోనీ ఉదాహరణ. ఈ లక్షణాలు ప్రధాన విలువలుగా మాక్సివిజన్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తద్వారా తమ సంస్థ గురించి అవగాహన కల్పించడం అనే లక్ష్యంతో ముందుకు సాగడానికి.. ధోని పరిపూర్ణ అంబాసిడర్ గా తన సేవలు అందిస్తారని భావిస్తున్నాం' అని మ్యాక్సివిజన్ యాజమాన్యం పేర్కొంది
'మహేంద్ర సింగ్ ధోని ఐకానిక్ హోదా.. భారీ స్థాయిలో అవగాహన పెంచడానికి సహాయపడుతుంది. ప్రజలు వారి కంటి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి, సకాలంలో వైద్య సంరక్షణను తీసుకునేలా ప్రోత్సహిస్తుంది' అని మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ గ్రూప్ CEO VS సుధీర్ అభిప్రాయపడ్డారు.
'క్రీడా రంగంలో స్పష్టమైన దృష్టికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రెగ్యులర్ గా పరీక్షలు చేయించుకుంటూ, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తద్వారా జీవితంలో శ్రేష్ఠతను సాధించవచ్చు. ఆటలు, ఆరోగ్యకరమైన జీవనం రెండూ అత్యుత్తమంగా ఉండేలా చూసుకోవాలి' అని ధోనీ సూచించారు.


Click it and Unblock the Notifications