Multibagger Stock: ప్రైవేట్ కంపెనీల రాకతో ప్రభుత్వ రంగంలోని కంపెనీలు కనుమరుగయ్యాయి. అయితే నేటికీ కొనసాగుతున్న కొన్ని మహారత్న కంపెనీలు మాత్రం ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తున్నాయి.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ప్రభుత్వ సంస్థ అయిన గెయిల్ ఇండియా స్టాక్ గురించే. దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను ఈ కంపెనీలో కొనసాగించిన ఇన్వెస్టర్లకు మంచి రాబడులు వచ్చాయి. 20 ఏళ్ల కాలంలో ఈ మల్టీబ్యాగర్ ఇన్వెస్టర్లకు 5 సార్లు బోనస్ షేర్లను అందించింది.

బోనస్ షేర్ల రాకతో లాభం..
ప్రభుత్వ మహారత్న కంపెనీ గెయిల్ ఇండియా తన ఇన్వెస్టర్లకు 20 ఏళ్లలో 5 సార్లు బోనస్ షేర్లను ఇచ్చింది. గెయిల్ ఇండియా అక్టోబర్ 2008లో 1:2 నిష్పత్తిలో బోనస్ షేర్లను అందించింది. మార్చి 2017లో 1:3 నిష్పత్తిలో బోనస్ షేర్లను అందించింది. తదనంతరం మార్చి 2018లో పెట్టుబడిదారులకు 1:3 నిష్పత్తిలో బోనస్ షేర్లను బహుమతిగా ఇచ్చింది. జూలై 2019న 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించింది. ప్రభుత్వరంగ సంస్థ ఇటీవల 1:2 నిష్పత్తిలో బోనస్ షేర్లను అందించింది.

బలమైన రాబడి..
2002లో కంపెనీ షేర్ విలువ రూ.7.92 వద్ద ఉంది. ఆ సమయంలో ఈ కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు 5 సార్లు బోనస్ షేర్లు పొందిన తర్వాత మంచి రాబడులను అందుకున్నారు. అప్పట్లో పొందిన 12,626 షేర్లు.. బోనస్ తర్వాత మొత్తం 1,01,007 కు చేరుకున్నాయి. ఈ రోజు మార్కెట్లు ముగిసే సమయానికి షేర్ ధర రూ.90.75 వద్ద ఉంది. అలా లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు దీర్ఘకాలంలో రూ.92 లక్షల రాబడి పొందుతారు.

కంపెనీ వ్యాపారం..
ఈ ప్రభుత్వరంగ సంస్థ 1984లో స్థాపించబడింది. GAIL లిమిటెడ్ అనేది సహజ వాయువు విలువ గొలుసు వ్యాపారం, ట్రాన్స్‌మిషన్, LPG ఉత్పత్తి & పంపిణీ, LNG రీ-గ్యాసిఫికేషన్, పెట్రోకెమికల్స్, సిటీ గ్యాస్ పంపిణీ వ్యాపారాల్లో దేశంలోని ప్రముఖ సహజ వాయువు కంపెనీగా ఉంది. దేశంలోని గ్యాస్ ట్రాన్స్‌మిషన్‌లో 70 శాతం, గ్యాస్ ట్రేడింగ్ లో 50 శాతం వాటాను కంపెనీ కలిగి ఉంది. సౌర, పవన, జీవ ఇంధనం వంటి పునరుత్పాదక శక్తిలో కూడా గెయిల్ తన ఉనికిని విస్తరిస్తోంది.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications