Dharavi Project: కేంద్రంలో బీజేపీ తక్కువ మెజారిటీతో అధికారంలోకి రావటం అదానీకి సైతం ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ పలుమార్లు గౌతమ్ ఆదానీకి మోదీ సహకారం అందిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరోపక్క ఇండియా కూటమి బలపడటం అదానీ ప్రాజెక్టులపై ప్రభావాన్ని చూపించనుందని తెలుస్తోంది.
ఈ క్రమంలో మహారాష్ట్రలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే అదానీకి పెద్ద హెచ్చరక ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే అదానీ రియాల్టీ కంపెనీకి ప్రస్తుతం ఉన్న షిండే ప్రభుత్వం ఇచ్చిన ధారవి రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ టెండర్‌ను రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో ప్రాజెక్టును సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు సవరించిన షరతులతో తాజా టెండర్‌ను ప్రకటిస్తామన్నారు. ఈ క్రమంలో థాక్రే తన మాధోశ్రీ నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ధారావీని ఖాళీ చేయెుద్దని సూచించారు.

అదే స్థలంలో నివాసితులకు కనీసం 500 చదరపు అడుగుల ఇళ్లను అందించాలని థాక్రే డిమాండ్ చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ టెండర్‌ను ఇప్పుడు ఎందుకు రద్దు చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ముంబైని అదానీ నగరంగా మార్చనివ్వమని థాక్రే అన్నారు. ప్రస్తుతం ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం అదానీ గ్రూపునకు అధిక రాయితీలు ఇచ్చిందని చెబుతూ డిమాండ్ సాధన కోసం శివసేన వాలంటీర్లు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతారని మీడియా ముఖంగా వెల్లడించారు. శివసేన అధినేత వ్యాఖ్యలపై ధారవి రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి స్పందించటానికి ఎవరూ ముందుకు రాలేదు.
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మద్దతుగల శివసేన నాయకుడు రాహుల్ శెల్వాలే థాక్రే స్పందిస్తూ ఆరోపణల్లో ఎలాంటి ఆధారం లేదని తేలింది. రానున్న శాసనసభ ఎన్నికలను విరాళాలను దృష్టిలో ఉంచుకుని ఈ విషయం చెప్పినట్లు తెలిపారు. అలాగే అదానీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రాజెక్టును అడ్డుకోవాలని థాక్రే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ విరాళాల సేకరణను అనుమతి ఇచ్చిన తర్వాత ధారవి రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై నిరాధార ఆరోపణలు చేశారని చెప్పారు. ధారావి ప్రజలకు 350 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు ఇవ్వాలని ఠాక్రే ఆమోదంతో నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. అసాధ్యమైన హామీతో ప్రజలను గందరగోళానికి గురిచేయవద్దని సూచించారు.
నవంబర్ 2022లో గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ రియాల్టీ 259-హెక్టార్ల ధారవి క్లస్టర్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కోసం టెండర్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ప్రాజెక్టును పూర్తి చేయటానికి అదానీ గ్రూప్ దాదాపు రూ.20,000 కోట్లు వెచ్చించనున్న వేళ దీనిపై మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు రాజకీయ రగడ జరుగుతోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications