Bonus shares: దీపావళికి ముందే బహుమతి.. ఒక్కో షేరుకు మరొక షేర్ ఫ్రీ.. మీ దగ్గర ఉందా..?

Free shares: దీపావళికి ముందు స్టాక్ మార్కెట్లో బోనస్ షేర్ల కోలాహలం నడుస్తోంది. చాలా కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు ఉచితంగా షేర్లను అందిస్తున్నాయి.

బోర్డు ఆమోదం..

బోర్డు ఆమోదం..

మహారాష్ట్ర సీమ్‌లెస్ కంపెనీ బోర్డ్ ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను అందించాలని నిర్ణయించింది. ఈ వివరాలను సోమవారం సెబీకి తెలియజేసింది. ఈ నిర్ణయం వివరాలు బయటకు రావటంతో మార్కెట్లో కంపెనీ షేర్లు 2 శాతం పడిపోయాయి. బీఎస్ఈలో స్టాక్ ఈరోజు రూ.860 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.

 బోనస్ షేర్లు..

బోనస్ షేర్లు..

కంపెనీ స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఇన్వెస్టర్లు కలిగి ఉన్న ఒక్కో షేరుకు గాను మరో షేరును ఉచితంగా అందించాలని నిర్ణయించింది. అయితే బోనస్ షేర్ల విషయంలో రికార్డ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. దీపావళి నాటికి కంపెనీ రికార్డ్ తేదీని ప్రకటించవచ్చని తెలుస్తోంది. అయితే స్టాక్ స్పిట్ గురించి సైతం బోర్డు చర్చకు వచ్చినప్పటికీ దానిని ఆమోదించలేదు.

మల్టీబ్యాగర్ రిటర్న్స్..

మల్టీబ్యాగర్ రిటర్న్స్..

ఈ ఏడాది స్టాక్ మార్కెట్‌లో కంపెనీ పనితీరు బాగానే ఉంది. 2022లో మల్టీబ్యాగర్ మహారాష్ట్ర సీమ్‌లెస్ షేర్ ధర రూ.518.70 నుంచి రూ.860 స్థాయికి పెరిగింది. ఈ క్రమంలో షేర్ దాదాపు 62 శాతం మేర పెరిగింది. అలాగే గడచిన 6 నెలల కాలంలో 45 శాతం వృద్ధి చెందింది. ఎన్‌ఎస్‌ఈలో స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.910గా ఉంది.

కంపెనీ వ్యాపారం..

కంపెనీ వ్యాపారం..

మహారాష్ట్ర సీమ్‌లెస్ స్టీల్ పైపులు, ట్యూబులను తయారు చేసే కంపెనీ. ఇది డి.పి. జిందాల్ గ్రూప్ కంపెనీ. కంపెనీ పెట్రోకెమికల్ కంపెనీలకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ సంస్థ 1988లో స్థాపించబడింది. ముంబై సమీపంలో 100 ఎకరాల్లో కంపెనీ తయారు ప్లాంట్ కలిగి ఉంది. కంపెనీ అవసరాల కోసం భారీ రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ కలిగి ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+