కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. లీటర్ పెట్రోల్ పైన రూ.8, లీటర్ డీజిల్ పైన రూ.6 తగ్గించి, వాహన వినియోగదారులకు మోడీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ధర తగ్గింపుపై నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించారు. దీంతో పెట్రోల్ ధర రూ.9.50, డీజిల్ ధర రూ.7 తగ్గింది. రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి, ధరలు తగ్గించాలని పరిశ్రమ నుండి మొదలు సామాన్యుల వరకు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పలు రాష్ట్రాలు తగ్గింపు బాట పట్టాయి.
పెట్రోల్, డీజిల్ పైన కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపు నిర్ణయాన్ని భారత కార్పోరేట్ వర్గాలు, ట్రేడర్లు, ఎగుమతిదారులు స్వాగతించారు. రాష్ట్రాలు కూడా సుంకాలను తగ్గించి కస్టమర్లకు మరింత ఉపశమనం అందించాలని కోరారు. ఇంధన ధరలు తగ్గితే సరుకు రవాణా వ్యయాలు తగ్గి ద్రవ్యోల్భణం అదుపులోకి వస్తుందని చెబుతున్నారు. ఇంధనంపై ఎక్సైజ్ సుంకం కోత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఇది ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుందని, తద్వారా సామాన్యుడిపై భారం తగ్గుతుందని, ప్రభుత్వం ఆలోచన మంచిదని తెలిపారు. దీనికి తోడు పలు రంగాల కంపెనీలకు ముడి వ్యయాలు తగ్గుతాయని చెబుతున్నారు.

కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ఇది రెండోసారి. దీంతో కొన్ని రాష్ట్రాలు కూడా తగ్గిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ వ్యాట్‌ను తగ్గించాయి. లీటర్ పెట్రోల్ పైన రూ.2.08, డీజిల్ పైన రూ.1.44 తగ్గిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రకటించింది. పెట్రోల్ పైన రూ.2.48, డీజిల్ పైన రూ.1.16 తగ్గిస్తున్నట్లు రాజస్థాన్, పెట్రోల్ పైన రూ.2.41, డీజిల్ పైన రూ.1.36 తగ్గిస్తున్నట్లు కేరళ ప్రకటించింది.
More From GoodReturns

పెట్రోల్, డీజిల్ పన్ను తగ్గింపు.. 15 రోజుల్లో కేంద్రానికి రూ. 7 వేల కోట్లు నష్టం..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

LPG సిలిండర్ల కొరత ఉందా? అసలు నిజం చెప్పిన ప్రభుత్వం.. సోషల్ మీడియా వార్తలను నమ్మకండి!

LPG: భారత్‌కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

ఇరాన్ యుద్ధం.. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు.. ఆర్థిక స్థిరత్వం కోసం ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications