ICICI Prudential: బ్యాంకింగ్ తో పాటు ICICI పలు రకాల సేవలను అందిస్తోంది. వాటిలో బీమా రంగం ఒకటి. ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్యూరెన్స్ పేరిట వినియోగదారులకు వివిధ ఇన్యూరెన్స్ సర్వీసెస్ ఆఫర్ చేస్తోంది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విభాగానికి పెద్ద షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌కు మహారాష్ట్ర GST విభాగం గట్టి షాక్ ఇచ్చింది. ఆ శాఖ డిప్యూటీ కమిషనర్.. దాదాపు 6.90 కోట్ల జరిమానా విధించినట్లు కంపెనీ ఎక్స్ఛేజ్ ఫైలింగ్ లో పేర్కొంది. అయితే నిర్ణీత గడువులోగా కమిషనర్(అప్పీల్స్) వద్ద అప్పీల్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించింది.

GST పోర్టల్‌లోని ఫారమ్ GSTR-2A మరియు GSTR-3Bలో క్లెయిమ్‌కి సంబంధించి ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ తో సరిపోలనందున ఈ పైన్ విధించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వడ్డీతో పాటు జరిమానా చెల్లించాలని GST అథారిటీ డిమాండ్ చేస్తోంది. ఇందులో సుమారుగా GST 3.3 కోట్లు కాగా.. వడ్డీ 3.23 కోట్లు, జరిమానా 33.27 లక్షలు పే చేయాలని తేల్చి చెప్పింది.
వస్తు, సేవల పన్ను క్రెడిట్ లో అసమతుల్యత కారణంగా రాష్ట్ర GST విభాగం ఇలా కొరడా ఝళిపించింది. ఇదిలా ఉండగా, సోమవారం కంపెనీ షేరు విలువ 1.08 శాతం పెరిగి.. చివరికి 601.40 వద్ద సెటిల్ కావడం విశేషం.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications