FDA News: ప్రముఖ ఫుడ్ అవుట్‌లెట్ మెక్‌డొనాల్డ్స్ కు మహారాష్ట్ర సర్కారు గట్టి షాక్ ఇచ్చింది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ కన్నెర్ర చేసింది. తీవ్ర చర్యలతో విరుచుకుపడింది. అయితే అంతలోనే యూటర్న్ తీసుకోవడంతో ఏమి జరిగిందో అర్థంకాక జనాలు ఆశ్చర్యపోతున్నారు.
ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్ లైసెన్స్ సస్పెన్షన్‌ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) రద్దు చేసింది. దీంతో సంస్థకు పెద్ద ఉపశమనం లభించినట్లైంది. జున్నుకి ప్రత్యామ్నాయం అని సూచించకుండా వంటలలో 'చీజ్ లాంటి' ఉత్పత్తిని ఉపయోగించినందుకు అవుట్‌లెట్ విమర్శలకు గురైంది.

FDA తనిఖీ మరియు అభ్యంతరాల తర్వాత మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్ తాత్కాలికంగా నిలిపివేయబడింది. ఉత్పత్తి పేర్ల నుంచి 'చీజ్' అనే పదాన్ని తొలగించినట్లు నివేదిక సమర్పించడంతో తదుపరి చర్యలను ఉపసంహరించినట్లు తెలుస్తోంది. స్వచ్ఛమైన చీజ్‌లో పాల కొవ్వు ఉండగా.. చీజ్ అనలాగ్‌లో పాలతో పాటు కూరగాయల కొవ్వు కూడా కలిసి ఉంటాయని FDA అధికారి వెల్లడించారు.
'అక్టోబర్ 2023లో కెడ్గావ్‌లోని అవుట్‌లెట్‌ను సందర్శించాము. అక్కడ ప్రదర్శించబడే ఆహార పదార్థాల పేర్లలో అమెరికన్ చీజ్ బర్గర్, అమెరికన్ చీజ్ నగ్గెట్స్, చీజ్ బర్గర్, ఇటాలియన్ చీజీ లావా బర్గర్ మరియు బ్లూబెర్రీ చీజ్ కేక్ ఉన్నాయని కనుగొన్నాము. ఈ పేర్లన్నీ వారి ఉత్పత్తులకు బ్రాండ్ నేమ్స్' అని FDA-అహ్మద్‌నగర్‌కు చెందిన ఫుడ్ సేఫ్టీ అధికారి రాజేంద్ర బడే తెలిపారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications