పెళ్లిళ్లలో కొన్ని సందర్భాల్లో గొడవలు సహజం. ఈ గొడవలకు రకరకాల కారణాలు కూడా మనం వింటుంటాం. పెళ్లి జరుగుతున్న సమయంలో ఎదో ఒక చిన్న కారణంగా పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా వైరల్ అవుతుంది. ఏంటంటే మహారాష్ట్రలోని ముర్తిజాపూర్‌లో ఒక వధువు కుటుంబం కూతురి వివాహాన్ని రద్దు చేసుకుంది. ఇందుకు జాతక కాలవకనో లేదా గొడవల కారణంగానో కాదు, వరుడి సిబిల్ (CIBIL) స్కోరు తక్కువగా ఉండటం వల్ల. అవును, మీరు విన్నది నిజమే ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ పెళ్ళికి ఒక అడ్డంకిగా మారింది.
అసలు విషయం ఏంటంటే పెళ్ళికి అన్ని సంప్రదింపులు దాదాపుగా ముగిశాయి,. సాధారణ పద్ధతులు, అంగీకారాలు తర్వాత రెండు కుటుంబాలు సరే అని అనుకున్నాయి. కానీ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి వధువు మామ ఎవరు కూడా ఊహించని డిమాండ్ చేశాడు. అతను వరుడి CIBIL స్కోర్‌ను చెక్ చేయాలని పట్టుబట్టాడు. దింతో తరువాత జరిగింది అందరినీ ఆశ్చర్యపరిచింది.

పెళ్లికొడుకుకి చాల లోన్స్ తీసుకున్నాడని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడని వెల్లడైంది. దింతో కూతురు భవిష్యత్తు గురించి ఆందోళన చెంది ఏమాత్రం లెట్ చేయకుండా వధువు కుటుంబం పెళ్లి క్యాన్సల్ చేసింది. అయితే "అప్పుల్లో మునిగిపోయిన అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి?" అని వధువు మామ వాదించాడని తెలుస్తోంది. మిగిలిన కుటుంబ సభ్యులు కూడా అతనికి సపోర్ట్ ఇవ్వడంతో పెళ్లి అక్కడితో ఆగిపోయింది.
సాంప్రదాయం ప్రకారం జాతక కలవక పోవడం లేదా కుటుంబ వంశ చరిత్ర వంటి అంశాలు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ ఈ ఘటన తర్వాత ఆర్థికంగా అబ్బాయి ఎలా ఉన్నాడు అనే అంశం ఇప్పుడు కొత్తగా కనిపిస్తోంది. దీని బట్టి ఒక విషయం స్పష్టమైంది ఏంటంటే మీ క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటే బ్యాంకులు మిమ్మల్ని రిజెక్ట్ చేయడమే కాదు అంతకంటే ఎక్కువ పరిణామాలే ఉండవచ్చు.
CIBIL స్కోరు ట్రాన్స్‌యూనియన్ సిబిఐఎల్ జారీ చేస్తుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సిబిఐఎల్ స్కోరుని నిర్వహిస్తుంది. బ్యాంకులు లోన్స్ ఆమోదించే ముందు లేదా క్రెడిట్ అందించే ముందు ఒక వ్యక్తి రిస్క్‌ను అంచనా వేయడానికి ఈ స్కోర్‌ను ఉపయోగిస్తారు. 750 కంటే ఎక్కువ స్కోరు సాధారణంగా లోన్ అప్రూవల్ ఈజీ చేస్తుంది. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంది అంటే లోన్ రిజెక్షన్ లేదా లోన్ వడ్డీ ఎక్కువగా ఉండొచ్చు.
మీ CIBIL స్కోర్ తగ్గేందుకు కారణాలు:
*లోన్ ఇంకా క్రెడిట్ కార్డు బిల్ టైంకి కట్టకపోవడం
*క్రెడిట్ హిస్టరీ సరిగ్గా లేకపోవడం
CIBIL స్కోర్ ఉండాలంటే ఎం చేయాలి:
*EMIలు, క్రెడిట్ కార్డ్ బిల్లులను టైంకి చెల్లించాలి
*ఎక్కువ లోన్లు తీసుకోవడం, పెండింగ్ అప్పులు ఉండటం
*క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ తక్కువగా ఉండటం
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications