Adani Semiconductor Project: టాటా, బిర్లా, అంబానీల తర్వాత భారతదేశంలో అదే స్థాయి వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అనేక వ్యాపారాలను చేపడుతున్నారు. భవిష్యత్తులో కొన్ని దశాబ్ధాలకు ఇబ్బంది లేకుండా వ్యాపారాన్ని ముందుకు కొనసాగించేందుకు క్లిష్టమైన వ్యాపారాలను చేపట్టి వాటిలో విజయం సాధింస్తున్నారు.
అదానీ గ్రూప్ చేపట్టనున్న సెమీకండక్టర్ ప్రాజెక్ట్‌కి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏక్‌నాథ్ షిండే క్యాబినెట్ సబ్‌కమిటీ గురువారం ఏకంగా రూ.1.17 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌కు చెందిన టవర్ సెమీకండక్టర్ అదానీ గ్రూప్ సంయుక్తంగా నిర్మించనున్న సెమీకండక్టర్ తయారీ ప్రాజెక్ట్ సైతం తాజా అనుమతులు పొందిన వాటిలో ఉంది. సుమారు రూ.84,947 కోట్లతో దీనిని రాయ్‌గఢ్ జిల్లాలోని పన్వెల్‌లో ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా దాదాపు 15 వేల మంది ఉపాధి పొందనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

వేదాంత-ఫాక్స్‌కాన్ సెప్టెంబర్ 2022లో పూణే సమీపంలోని తలేగావ్ ఫేజ్ IV వద్ద సెమీకండక్టర్ ప్లాంట్‌లో రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడిని రద్దు చేసిన రెండేళ్ల తర్వాత అదానీ గ్రూప్ సెమీకండక్టర్ల వ్యాపారంపై తన దృష్టిని సారించింది. రాయ్‌ఘర్ జిల్లాలో నెలకొల్పుతున్న మెగా సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్ రెండు దశల్లో అభివృద్ధి కానుంది. మెుదటి దశలో రూ.58,763 కోట్లు ప్లాజెక్టు కోసం వెచ్చించనుండగా, రెండవ దశలో రూ.25,184 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించబడింది.
ఈ సెమీకండక్టర్ల తయారీ యూనిట్ రాయ్‌గఢ్ జిల్లాలోని నవీ ముంబై శివారులో ఉంటుంది. ఇది మొదటి దశలో నెలకు 40,000 వేఫర్ స్టార్ట్స్(WSPM) ప్రారంభ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పూర్తయిన తర్వాత మొత్తం సామర్థ్యం 80,000 WPSMకి చేరుకుంటుందని అంచనా వేయబడింది.
ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయిలో ఆమోదం పొందినప్పటికీ ఇజ్రాయెల్ టవర్ సెమీకండక్టర్, అదానీ గ్రూప్ సమర్పించిన ఉమ్మడి దరఖాస్తు ప్రస్తుతం ఇండియా సెమీకండక్టర్ మిషన్, IT మంత్రిత్వ శాఖ సమీక్షలో ఉందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత ప్రభుత్వం రాష్ట్రాలకు వారి స్వంత సెమీకండక్టర్ యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు స్వయంప్రతిపత్తిని ఇచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications