బ్లింకిట్, బిగ్‌బాస్కెట్, అమెజాన్ వంటి చాల ఈ-కామర్స్ కంపెనీలు మహా కుంభ జలాలను(water) ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాయి. దీనిపై భారీ లాభాలు కూడా ఆర్జిస్తున్నాయి. ఈ మహా కుంభమేళా పవిత్ర జలాన్ని ఆన్‌లైన్‌లో అమ్మడంపై షీల్డ్-ఇండియా వ్యవస్థాపకుడు నమన్‌బీర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లింకిట్ 'మహాకుంభ సంగం గంగా జల్' ను రూ.69కి అమ్మడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. దీని ప్రామాణికత, ధరపై కూడా నమన్‌బీర్ సింగ్ విమర్శలు కురిపించారు. మతపరమైన భావాలను వ్యాపారం చేయడంపై కూడా ఆయన చర్చను లేవనెత్తారు.
నమన్‌బీర్ సింగ్ లింక్డ్ఇన్ పోస్ట్‌లో 'సంగం వాటర్ లేదా తెలివైన మార్కెటింగ్?' పేర్కొన్నారు. బ్లింకిట్ అమ్ముతున్న గంగా జలాల ప్రామాణికతపై ఆయన ప్రశ్నలు కురిపించారు. ఈ నీరు వాస్తవానికి మహాకుంభ సంగం నుండి వచ్చిందో లేదో ఖచ్చితం చేయడం కష్టమని అన్నారు. 'ఈ నీరు నిజమైన సంగం నుండి వచ్చిందా లేదా నిరూపించడానికి నా దగ్గర సమాధానం లేదు' అని సింగ్ రాశారు. నీటిలో కొద్దిగా నిజమైన గంగా జలాన్ని కలపడం ద్వారా సాధారణ నీటిని స్వచ్ఛమైనదిగా ఎలా అమ్ముతారో వెల్లడించారు. సంగం నీటి విషయంలో కూడా అదే జరుగుతుందని అన్నారు.

'సంగం నీటిని తీసుకురావడానికి అయ్యే ఖర్చు దాదాపు సున్నా, ఎందుకంటే ఎవరైనా దానిని చిన్న సీసాలో తీసుకురావచ్చు' అని సింగ్ అన్నారు. మొత్తం ఉత్పత్తికి నిజమైన నీటి బాటిల్‌ను జోడిస్తే లాభం చాలా ఎక్కువగా ఉంటుందని కూడా తెలిపారు. ఒక లీటరు బిస్లరీ బాటిల్ ధర 20 రూపాయలు. అదే సమయంలో బ్లింకిట్ సంగమ్ జల్ 100 మి.లీ. రూ. 99కి లభిస్తుంది. బ్లింకిట్‌ను లక్ష మంది భక్తులకు విక్రయిస్తే దాదాపు కోటి రూపాయలు సంపాదించవచ్చని అంచనా వేశారు. "ఇది పూర్తిగా '15 దిన్ మే పైసా డబుల్ స్కీమ్'" అంటూ చమత్కరించాడు.
సంగం గంగా జలాలను ఎంత ధరకు అమ్ముతున్నారు ?
ఈ వివాదం ఉన్నప్పటికీ, అనేక పెద్ద ఈ-కామర్స్ కంపెనీలు ఈ వ్యాపారంలోకి దూకాయి. బ్లింకిట్ 'మహాకుంభ సంగమ గంగాజలం'ను రూ. 69కి అందిస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో 100 చదరపు అడుగుల స్టోర్ కూడా ప్రారంభించింది. బిగ్‌బాస్కెట్ 'స్వస్తి మహాకుంభ్ పవిత్ర త్రివేణి సంగమ జల్'ను ప్రారంభించింది, ఇది గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం నుండి నేరుగా నీటిని తీసుకురావడానికి హామీ ఇస్తుంది. అమెజాన్ పవిత్ర స్థలం నుండి 'మహాకుంభ - త్రివేణి నీరు (100 మి.లీ.) + మట్టి'ని రూ.121కి విక్రయిస్తోంది.
అతని పోస్ట్ నమ్మకం, వ్యాపారంపై పెద్ద చర్చకు దారితీసింది. ఈ కంపెనీలు ఆధ్యాత్మిక అనుభవాలను మరింత అందుబాటులోకి తెస్తున్నాయని వాదిస్తున్నారు. కానీ కొంతమంది మతపరమైన భావాల నుండి లాభం పొందడంలోని నైతికతను ప్రశ్నిస్తున్నారు. 'బ్లింకిట్, జెప్టో, బిగ్‌బాస్కెట్, అమెజాన్ మీ ఇంటికి పవిత్ర జలాన్ని అందిస్తున్నాయి, కానీ ఎంత ధరకు?' అంటూ సింగ్ ప్రశ్నించారు. 'మీరు భారతదేశంలో నమ్మకం ఆధారిత వ్యాపారాన్ని నిర్మించగలిగితే, మీరు బిలియనీర్ కావచ్చు' అంటూ పోస్ట్ చేసారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications