Nestle: నెస్లేపై ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఎఫెక్ట్.. కంపెనీ కీలక నిర్ణయం..
Nestle News: ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న పోరు రెండు దేశాల ప్రజలకే కాక అంతర్జాతీయంగానూ అనేక ఇబ్బందులను సృష్టింస్తోంది. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న పెద్ద గ్లోబల్ కంపెనీలు ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
ఇటీవల దేశీయ టాప్ టెక్ కంపెనీలు సైతం అక్కడ పనిచేస్తున్న తమ ఉద్యోగుల భద్రతపై స్పందించాయి. తాము ఎప్పకిటప్పుడు పరిస్థితులను వాకబు చేస్తున్నట్లు టీసీఎస్, హెచ్సీఎల్ వంటి సంస్థలు ప్రకటించాయి. ఈ క్రమంలో తాజాగా చాక్లెట్ నుంచి హెల్త్ డ్రింక్స్ వరకు అనేక ఉత్పత్తులను తయారు చేసే ప్రపంచంలో అతిపెద్ద సంస్థ నెస్లే ఇజ్రాయెల్‌లో వ్యాపారంపై కీలక ప్రకటన చేసింది.

యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్న తమ తయారీ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ముందుజాగ్రత్తగా ఇజ్రాయెల్‌లోని ఒక ప్లాంట్‌ను మూసివేసినట్లు నెస్లే తెలిపింది. ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక దాడి తర్వాత అనేక ప్రపంచ కంపెనీలు తమ కర్యకలాపాలను ఒకదాని తర్వాత మరొకటి పరిశీలిస్తూ అవసరం మేరకు అక్కడ కార్యకలాపాలను మూసివేయడం వంటి నిర్ణయాలు తీసుకున్నాయి.
ఇజ్రాయెల్-పాలస్తీనాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల తమ ఉద్యోగులు, సహోద్యోగులను సురక్షితంగా ఉంచటంపై తాము పూర్తిగా దృష్టి సారించినట్లు నెస్లే సీఈఓ మార్క్ ష్నైడర్ ప్రకటించారు. ఎప్పటికప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
ఇదే సమయంలో నేడు నెస్లే ఇండియా తన క్యూ2 ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో 1:10 నిష్పత్తిలో షేర్లను స్పిట్ చేస్తున్నట్లు ప్రకటించింది. మార్కెట్లో కంపెనీ షేర్ల లిక్విడిటీని పెంచే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇదే క్రమంలో ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.140 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. సెప్టెంబరుతో ముగిసిన కాలానికి కంపెనీ రూ.908 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో రూ.5,036.8 కోట్ల నికర ఆదాయాన్ని నమోదు చేసింది.


Click it and Unblock the Notifications