FAST5 Grand Prize: జీవితంలో ఒక్కసారైనా అదృష్టం తగిలితే బాగుంటుందని మనలో చాలా మంది భావిస్తుంటారు. అయితే దేనికైనా పెట్టిపుట్టుండాలని మన పూర్వీకులు చెబుతుంటారు.
తాజాగా తమిళనాడుకు చెందిన మగేష్ కుమార్ నటరాజన్ కి అదృష్టం తలుపు తట్టింది. అతను ఒక ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఆయన "FAST5 గ్రాండ్ ప్రైజ్" ఆఫ్ ఎమిరేట్స్ డ్రాలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) బయట గెలుచుకున్న వ్యక్తిగా నిలిచారు. దీంతో రానున్న 25 ఏళ్ల పాటు నెలకు రూ.5.5 లక్షల చొప్పున దీని నుంచి పొందనున్నారు.

పెద్ద మెుత్తంలో ప్రైజ్ మనీని సొంతం చేసుకున్న నటరాజన్.. ఈ డబ్బును సమాజంలో అవసరమైన వారికి సాయం చేసేందుకు వినియోగిస్తానని వెల్లడించారు. అలాగే తన కుటుంబానికి మంచి భవిష్యత్తును ఇచ్చేందుకు, కుమార్తె విద్య కోసం ఉపయోగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
వాస్తవానికి ఆయన సౌదీ అరేబియాలో నాలుగు సంవత్సరాల పని అసైన్‌మెంట్ సమయంలో ఎమిరేట్స్ డ్రా గురించి తెలుసుకున్నారు. తన జీవితంలో ఎక్కువ భాగం తమిళనాడులోని అంబూర్‌లో గడిపిన నటరాజన్, ఎమిరేట్స్ డ్రా అధికారుల నుంచి కాల్ వచ్చే వరకు తాను గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్నానని మొదట్లో నమ్మలేదని తెలిపారు. మెుత్తానికి అదృష్టం తోడుకావటంతో జీవితం సెటిల్ అయ్యే బంపర్ తగిలిందని చెప్పుకోవాలి.

ఎమిరేట్స్ డ్రాలో మేనేజింగ్ పార్టనర్ మహ్మద్ బెహ్రూజియన్ అలవాది మాట్లాడుతూ.. సంస్థ దృష్టి ఆటలకు అతీతంగా విస్తరించి ఉందని, ప్రపంచవ్యాప్తంగా సాధ్యమైనంత ఎక్కువ మంది జీవితాలను మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications