Magenta Lifecare IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎన్నికల హడావిడి ముగిసిన వెంటనే ఇన్వెస్టర్లు తిరిగి ఐపీవోలపై బెట్టింగి షురూ చేశారు. తాజాగా మార్కెట్లలోకి వస్తున్న ఐపీవోలకు పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన కనిపించటం దీనినే సూచిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మెజెంటా లైఫ్‌కేర్ కంపెనీ ఐపీవో గురించే. ఈ ఐపీవోకి దేశీయ ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దీంతో కంపెనీ ఐపీవో ప్రారంభమైన తొలి రోజునే 100 శాతానికి పైగా సబ్‌స్క్రైబ్ చేయబడింది. గ్రే మార్కెట్‌లో కంపెనీకి ఎక్స్‌పోజర్ కూడా ఉంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ ఐపీవో జూన్ 5న ప్రారంభించబడి జూన్ 7న ముగియనుంది. ఈ క్రమంలో ఐపీవోలో షేర్ల కోసం దరఖాస్తు చేసిన ఇన్వెస్టర్లకు కేటాయింపు జూన్ 10న ఉంటుందని తెలుస్తోంది. అలాగే BSE SMEలో కంపెనీ లిస్టింగ్ జూన్ 12, 2024న జరగనుంది.

ఇన్వెస్టర్ల నుంచి భారీగా స్పందన పొందుతున్న ఐపీవోకి కంపెనీ ఒక్కో షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.35గా నిర్ణయించింది. ఈ క్రమంలోనే లాట్ పరిమాణాన్ని 4000 షేర్లుగా నిర్ణయించింది. దీని కారణంగా రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రూ.1,40,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుత ఐపీవో ద్వారా మార్కెట్ల నుంచి రూ.7 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం 20 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది. ఇక గ్రేమార్కెట్ ప్రీమియం విషయానికి వస్తే ఈరోజు ఒక్కో షేరుకు రూ.28గా ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే లిస్టింగ్ రోజున కంపెనీ పెట్టుబడిదారులకు 80 శాతం రాబడిని ఇవ్వగలదు.
ఐపీవో మొదటి రోజు అంటే నిన్న 24.49 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. రిటైల్ విభాగంలో అత్యధికంగా 39.50 రెట్లు సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. ప్రస్తుతం కంపెనీకి దివీష్ మోదీ, కీర్తి మోదీ ప్రమోటర్లుగా ఉన్నారు. ఇష్యూకి ముందు కంపెనీలో వారి హోల్డింగ్ 84.06 శాతం ఉండగా ప్రస్తుతం అది 59.59 శాతానికి తగ్గనుంది. ఇక వ్యాపారం విషయానికి వస్తే.. ఈ కంపెనీ ఫోమ్‌కు సంబంధించిన వ్యాపారం చేస్తోంది. కంపెనీ పరుపులు, దిండ్లు తయారు చేస్తుంది. గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ ప్రస్తుతం 41 మంది ఉద్యోగులను కలిగి ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications