Maduro: అమెరికాను వ్యతిరేకించి.. అమెరికా బ్రాండ్ దుస్తుల్లోనే దొరికిపోయిన మదురో! వైరల్ అవుతున్న నైకీ జాకెట్!
జనవరి 3, 2026న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో(Maduro)ను అమెరికా దళాలు బంధించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే రాజకీయ పరిణామాల కంటే ఎక్కువగా ఇప్పుడు మరో విషయం ట్రెండ్ అవుతుంది. అదే మదురో ధరించిన ట్రాక్ సూట్. అరెస్ట్ సమయంలో మదురో ధరించిన నైకీ (Nike) ట్రాక్‌సూట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ అయింది.

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో(Maduro)ను అమెరికా దళాలు బంధించి, విమానంలో అమెరికాకు తరలిస్తున్న ఫోటోను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. చేతులకు బేడీలు, కళ్లకు గంతలతో ఉన్న మదురో ఫోటో క్షణాల్లో వైరల్ అయింది. అయితే ఇప్పుడు నెటిజన్ల కన్ను ఆయన వేసుకున్న నైకీ ట్రాక్ సూట్ (Grey Nike Tech Fleece) పై పడింది.
సూట్ వివరాలు
మదురో తల నుండి కాలి వరకు ధరించిన వస్తువుల ధరలు, బ్రాండ్ వివరాలను నెటిజన్లు జూమ్ చేసి మరీ కనిపెట్టారు..
- Nike Tech Fleece Tracksuit: ఇది నైక్ బ్రాండ్‌లో అత్యంత పాపులర్ కలెక్షన్.
- గ్లోబల్ ధర: జాకెట్ ధర $140 (సుమారు రూ. 11,700), ప్యాంట్ ధర $120 (సుమారు రూ. 10,000). మొత్తం సెట్ సుమారు రూ. 22,000 వరకు ఉంటుంది.
- ఇండియా ధర: మన దేశంలో నైకీ అధికారిక వెబ్ సైట్ ప్రకారం, దీనికి సమానమైన 'Nike Tech Full-Zip Windrunner Hoodie' ధర సుమారు రూ. 6,995 గా ఉంది.
- Wanme Sleep Mask: కళ్లకు ఉన్న మాస్క్ ధర కేవలం 6 డాలర్లు (సుమారు రూ. 500).
- Flintronic Ear Protectors: చెవులకు ఉన్న నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ ప్రొటెక్టర్ ధర 11 డాలర్లు (సుమారు రూ. 920).
అమెరికా బ్రాండ్.. ఐరనీ అంటే ఇదే!
నికోలస్ మదురో ఎప్పుడూ అమెరికాను, అక్కడి పెట్టుబడిదారీ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. కానీ, ఆయన అరెస్ట్ సమయంలో ఏకంగా ఒక అమెరికన్ దిగ్గజ బ్రాండ్ (Nike) దుస్తుల్లోనే కనిపించారు. ఇదొక పెద్ద 'ఐరనీ' అని విమర్శకులు ఎద్దేవా చేస్తున్నారు. ఇంటర్నెట్ లో ప్రస్తుతం మదురో అరెస్ట్ ఫొటోతో పాటు మదురో నైకీ సూట్ కూడా ట్రెండ్ అవుతోంది.
స్టాక్ అవుట్.. ఎక్కడ కొనాలి?
మదురో(Maduro) ఫోటో వైరల్ అయిన కొన్ని గంటల్లోనే అమెరికాలోని నైకీ వెబ్‌సైట్‌లో 'గ్రే కలర్' టెక్ ఫ్లీస్ స్టాక్ అయిపోయిందని సమాచారం. ముఖ్యంగా మదురో ధరించిన 3XL సైజుకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ ట్రాక్ సూట్ కావాలనుకునేవారు నైకీ అధికారిక వెబ్‌సైట్ లో చూడొచ్చు. లేదా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి స్టోర్లలో కూడా ఇవి లభిస్తాయి. అయితే ప్రస్తుతం ఉన్న క్రేజ్ చూస్తుంటే భారత్ లో కూడా స్టాక్ అయిపోయే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఏదేమైనా ఒక భారీ రాజకీయ పరిణామం అకస్మాత్తుగా ఒక బ్రాండ్‌కు కోట్ల రూపాయల ఉచిత పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. నైకీ కంపెనీ ఒక్క రూపాయి ఖర్చు చేయకుండానే తన బ్రాండ్ వాల్యూను పెంచుకుంది.


Click it and Unblock the Notifications