మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఈ మేరకు సోమవారం లోకసభకు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో పెట్రోల్ పైన ఎక్కువ ట్యాక్స్ ఉందని, అలాగే రాజస్థాన్ రాష్ట్రంలో డీజిల్ పైన ఎక్కువ ట్యాక్స్ ఉందని తెలిపారు. లోకసభకు లిఖితపూర్వకంగా ఇచ్చారు రాష్ట్రాలు విధించే వ్యాల్యూ యాడెడ్ ట్యాక్సెస్(VAT), కేంద్రపన్నులు సహా అన్నీ కలిపి పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100కు చేరుకున్నాయి.
దేశంలో అత్యధికంగా పెట్రోల్ పైన మధ్యప్రదేశ్ ప్రభుత్వం వ్యాట్ వసూలు చేస్తోందని, రాజస్తాన్ డీజిల్ పైన అత్యధికంగా వ్యాట్ వసూలు చేస్తోందని తెలిపారు. దేశంలో ఈ నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్టస్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. పెట్రోల్ ధరలో 55 శాతం, డీజిల్ ధరలో 50 శాతం మేర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధిస్తున్న పన్నులేనని అన్నారు.

కేంద్రం లీటర్ పెట్రోల్ పైన రూ.32.90, లీటర్ డీజిల్ పైన రూ.31.80 ఎక్జైజ్ డ్యూటీ విధిస్తోంది. మిగతా మొత్తం రాష్ట్రాలు వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్నాయని తెలిపారు. 2020-21 ఆర్థికంలో కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ రూపంలో రూ.1,01,598 కోట్లను పెట్రోల్ నుండి, రూ.2,33,296 కోట్లు డీజిల్ నుండి వసూలు చేసిందని తెలిపారు. పెట్రోల్, డీజిల్ మూల ధర, కేంద్ర పన్నులపై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ విధిస్తున్నాయన్నారు.
దేశంమొత్తమ్మీద అండమాన్ నికోబార్ దీవుల్లో వ్యాట్ తక్కువగా లీటర్ పెట్రోల్ పైన రూ.4.82, డీజిల్ పైన 4.74 ఉందని తెలిపారు. అలాగే దేశంలోనే అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో లీటరు పెట్రోల్‌పై వ్యాట్ రూ.31.55, రాజస్తాన్‌లో డీజిల్‌పై రూ.21.82గా ఉందన్నారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications