Madhapar Village: సాధారణంగా పల్లెటూరు అంటే ఎలా ఉంటుంది..పచ్చని పొలాలు, చల్లగాలి, మట్టి ఇళ్లు, పొలాలు, పశువులు, మేకలు, నెమ్మదిగా సాగే జీవితం ఇవే గుర్తుకు వస్తాయి. అయితే గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న మాధపర్ గ్రామాన్ని చూస్తే మాత్రం ఇవేమి గుర్తుకురావు. అది పేరుకే గ్రామం కాని దాని అభివృద్ధి మన హైదరాబాద్ కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఈ చిన్న ఊరు ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామంగా రికార్డులకెక్కింది.
ఈ చిన్న ఊరిలో మొత్తం 17 బ్యాంకులు పనిచేస్తున్నాయంటే దీని అభివృద్ధి ఎలా ఉందో ఇట్టే చెప్పవచ్చు. ఇక్కడి బ్యాంకుల్లో రూ. 7 వేల కోట్లకుపైగా డిపాజిట్లు ఉన్నాయి. ఇక్కడ సుమారు 20 వేల ఇళ్లు, 32 వేల మంది జనాభా మాత్రమే ఉన్నారు. అయితే వీరి బ్యాంక్ బ్యాలన్స్ మాత్రం కోట్ల రూపాయల లోనే ఉంటుంది. 17 బ్యాంకులే కాకుండా ఈ గ్రామంలో ఇంకా కొన్ని బ్యాంకులు తమ శాఖలు ప్రారంభించడానికి ఇప్పుడు ఆసక్తి చూపుతున్నాయి
మరి మాధపర్ గ్రామం విజయ రహస్యం ఏంటి అనుకుంటున్నారా.. ఇక్కడి నుండి అనేక కుటుంబాలు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా, గల్ఫ్ దేశాలకు వెళ్లి స్థిరపడ్డాయి. అక్కడ సంపాదించిన డబ్బును వీరంతా స్వగ్రామం అభివృద్ధికి మళ్లిస్తున్నారు. అదే ఈ గ్రామం యొక్క ప్రత్యేకత. బ్యాంక్ డిపాజిట్ల రూపంలోనే కాకుండా, గ్రామంలో విద్య, ఆరోగ్యం, రహదారులు, మౌలిక సదుపాయాల కోసం పెద్ద మొత్తంలో ఇక్కడి నుండి విదేశాలకు వెళ్లిన వారు పెట్టుబడులు పెడతారు. ఫలితంగా ఈ గ్రామం ఆసియాలోనే నంబర్ వన్ గా దూసుకుపోతోంది.

మాధపర్ గ్రామం చరిత్రను చూస్తే.. ఇది 12వ శతాబ్దం దాకా మనల్ని తీసుకువెళ్తుంది. అప్పట్లో దేవాలయాలు, వారసత్వ కట్టడాలను నిర్మించడంలో ప్రసిద్ధి పొందిన మిస్త్రి కమ్యూనిటీ ఈ గ్రామాన్ని స్థాపించింది. 1473-1474 (VS 1529)లో ధనేటి గ్రామం నుండి KGK కమ్యూనిటీకి చెందిన మాధ కంజి సోలంకి ఈ ఊరు వచ్చారు. ఈ ఊరుకు ఆయన పునాది గట్టిగా వేయడంతో అతని పేరు మీద మాధపర్ గ్రామం ఏర్పడింది. అనంతర కాలంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు. ప్రస్తుతానికి ఈ గ్రామంలో పటేల్ కమ్యూనిటీ ఎక్కువగా ఉంది. కాలంతో పాటు, ఉన్నత విద్య, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం ఇక్కడి యువత విదేశాలకు వెళ్ళినా.. స్వగ్రామంపై అనుబంధాన్ని మాత్రం వారు వదల్లేదు. అందుకే అభివృద్ధిపరంగా ఈ గ్రామం ప్రపంచంలోనే నంబర్ వన్ గా దూసుకుపోతోంది.
మాధపర్‌లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు ఏ టాప్ నగరానికీ తీసిపోకుండా ఉన్నాయి. విశాలమైన రోడ్లు, పరిశుభ్రమైన వ్యవస్థ, నాణ్యమైన పాఠశాలలు, కాలేజీలు, ఆధునిక వైద్య సదుపాయాలు, ఉద్యానవనాలు..అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. గ్రామం మధ్యలో కాంక్రీట్ భవనాలు, సొగసైన ఇళ్లు, ఆధునిక సౌకర్యాలు ఈ ఊరిని మరింత అందంగా తీర్చిదిద్దుతున్నాయి.
1971 భారత-పాకిస్తాన్ యుద్ధంలో, పాకిస్తాన్ వైమానిక దాడుల వల్ల ఒక ముఖ్యమైన భారత వైమానిక స్థావరం ధ్వంసమైంది. ఆ క్లిష్ట సమయంలో గుజరాత్‌లోని మాధపర్ గ్రామానికి చెందిన 300 మంది మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, కేవలం 72 గంటల్లోపే ఆ స్థావరాన్ని తిరిగి నిర్మించారు. వారి త్యాగం, అద్భుతమైన పట్టుదల వల్ల భారత వైమానిక దళం ప్రతిదాడి చేసి యుద్ధంలో భారత్‌కు విజయం సాధించింది.ఈ అసాధారణ సాహసానికి గుర్తుగా.. భారత ప్రభుత్వం 2015 ఆగస్టు 28న మాధపర్‌లో ఒక ప్రత్యేక యుద్ధ స్మారకాన్ని ప్రారంభించింది. దాని పేరే విరంగన స్మారక్. ఇది దేశభక్తి, సమాజ ఐక్యత, మహిళా శక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications