Made in India TVs: గత సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో 'మేడ్ ఇన్ ఇండియా' టీవీల అమ్మకాలు దూసుకు పోయినట్లు 'కౌంటర్ పాయింట్' సంస్థ తెలిపింది. 2022లో మూడవ త్రైమాసికానికిగాను 33 శాతం వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. డిక్సన్ టెక్నాలజీస్ అగ్రగామిగా నిలవగా.. రేడియంట్ తర్వాత స్థానాన్ని ఆక్రమించింది. ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం లభించడంతో.. దేశీయ తయారీ రంగం మంచి వృద్ధిని నమోదు చేస్తున్నట్లు అభిప్రాయపడింది. కానీ ఇదే సమయంలో 'మేడ్ ఇన్ ఇండియా' స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 8 శాతం మేర మందగించాయి.
పండుగ సీజన్ కావడంతో వినియోగదారుల నుంచి కొనుగోళ్లు భారీగా జరిగినట్లు తెలుస్తోంది. టాప్ 5 కంపెనీలే 50% మార్కెట్ వాటాను ఆక్రమించాయి. దేశీయ తయారీ రంగం కూడా.. స్మార్ట్ వాచ్‌లు, ఇయర్ ఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ వైపు మెగ్గుచూపాయి. గత త్రైమాసికంలో 16% ఉన్న అమ్మకాల వృద్ధి రేటు ఇప్పుడు 34 శాతానికి చేరుకోవడం శుభపరిణామం.

మేడిన్ ఇండియా ద్వారా కేవలం టీవీలు, స్మార్ట్ వాచ్‌లకు మాత్రమే పరిమితం కాకుండా.. పలు ఇతర ఉత్పత్తుల తయారీలోనూ స్వయం సమృద్ధి సాధించే దిశగా దేశం ముందడుగు వేస్తోంది. అంతర్జాతీయ విపణిలో మెజారిటీ భాగస్వామ్యాన్ని చేజిక్కునేందుకు మెల్లగా బాటలు వేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ల విషయమై సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. గుజరాత్ సహా పలు రాష్ట్రాలు వాటి తయారీ కోసం పాలసీలు రూపొందిస్తుండటం హర్షించదగ్గ విషయం.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications