ప్రపంచం ‘మేడ్ ఇన్ ఇండియా’ కార్లకే ఫిదా… మరి మన బ్రాండ్స్ ఎందుకు రేసులో వెనుక

భారత్ ఇప్పుడు ప్రపంచ ఆటోమొబైల్ హబ్‌గా మారిపోయింది. ఇక్కడ తయారైన కార్లు అమెరికా నుంచి ఆఫ్రికా వరకు, యూరప్ నుంచి మిడిల్ ఈస్ట్ వరకు రోడ్ల మీద దూసుకెళ్తున్నాయి. 'మేడ్ ఇన్ ఇండియా' అనే ముద్ర అంతర్జాతీయ మార్కెట్‌లో బలంగా వినిపిస్తోంది. కానీ ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ విజయాల వెనక ఎక్కువగా విదేశీ బ్రాండ్స్ (మారుతీ సుజుకి, హ్యుందాయ్, కియా) ఉన్నాయే తప్ప, మన స్వదేశీ ఆటో దిగ్గజాలు టాటా, మహీంద్రా మాత్రం ఇంకా అంత స్థాయిలో రాణించలేకపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? ఎక్కడ వెనకబడి ఉన్నాయి? ఇంకా ఎక్కడ అవకాశాలు ఉన్నాయి?

Vision SUVs Avinya EV eVitara Electric Vehicles Indian Automobile Brands Mahindra Vision SUVs Tata Avinya EV Maruti eVitara Jaguar Land Rover Global Market Premium Markets Exports South Africa Automobile Market

"మేడ్ ఇన్ ఇండియా" స్టిక్కర్ ఉన్న కార్లు 100కి పైగా దేశాల్లో తిరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఓ ట్విస్ట్ ఏంటంటే మన స్వదేశీ బ్రాండ్స్ అయిన టాటా ఇంకా మహీంద్రా మాత్రం నెమ్మదిగా తమ మార్గం వేసుకుంటున్నాయి.

మారుతీ ఎగుమతుల విషయంలో ముందంజలో ఉంటే, టాటా-మహీంద్రా మాత్రం ఇంకా వెనకబడి ఉన్నాయ్. ఆగస్టులో వరుసగా మూడు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మారుతీ తన తొలి ఎలక్ట్రిక్ కారు eVitaraని భారత్‌లో మాత్రమే కాకుండా 100కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తామని ప్రకటించింది. మరోవైపు టాటా మోటార్స్, ఆఫ్రికాలో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన దక్షిణాఫ్రికాలోకి మళ్లీ అడుగుపెట్టి కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. మహీంద్రా నాలుగు కొత్త SUV కాన్సెప్ట్స్‌ను (Vision సిరీస్) చూపించింది.

అయితే ఎగుమతుల లెక్కలు చూస్తే కాస్త నిరాశే చెందింది. FY25లో భారత్ నుంచి మొత్తం 7.7 లక్షల కార్లు బయటకు వెళ్ళగా, టాటా-మహీంద్రా కలిపి కేవలం 18,500 యూనిట్లు మాత్రమే ఎగుమతి చేశాయి. అంటే 2% షేర్ కూడా రాలేదు.

జపాన్, కొరియా కంపెనీలు వందేళ్లుగా కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించుకున్నాయి. కానీ టాటా, మహీంద్రా ఇంకా "గ్లోబల్ ప్లేయర్"లుగా పేరు తెచ్చుకోవాల్సిన పని ఉంది. విదేశీ మార్కెట్‌లో కారు కొనేవాళ్లు "పేరున్న బ్రాండ్" మీదే నమ్మకం పెడతారు. కాని మన బ్రాండ్స్ ఒక కొత్త దేశం లేదా మార్కెట్‌లోకి అడుగు పెట్టాక, అక్కడ కేవలం కార్ అమ్మడం మాత్రమే కాకుండా, స్ట్రాంగ్ సర్వీస్ నెట్‌వర్క్ కూడా నిర్మించుకోవాలి. ఎందుకంటే కారు కొన్న తర్వాత కస్టమర్‌కి అసలు నమ్మకం వచ్చే విషయం మెయింటెనెన్స్, రిపేర్, స్పేర్ పార్ట్స్ లాంటి వాటి పైనే ఆధారపడి ఉంటుంది.

జపాన్, కొరియా బ్రాండ్స్ ఎందుకు గెలిచాయో తెలుసా? వాళ్లు ఎక్కడ మార్కెట్‌లోకి వెళ్లినా, అక్కడ సర్వీస్ సెంటర్స్, రిపేర్ సపోర్ట్, స్పేర్ పార్ట్స్ సప్లై అన్నీ రెడీగా పెడతారు. దాంతో కస్టమర్ "ఈ బ్రాండ్ safe" అని ఫీల్ లోకి వస్తున్నారు. అదే మన బ్రాండ్స్ కూడా చేయగలిగితే, బయట మార్కెట్‌లో ఇంకా బలంగా నిలబడగలవు.

అయితే మొత్తం సీన్ ఒక్కలాగ లేదు. గత ఐదు సంవత్సరాల్లో ఇండియన్ కస్టమర్లు కూడా గ్లోబల్ స్టాండర్డ్స్‌కి దగ్గరగా డిమాండ్ చేస్తున్నారు. సేఫ్టీ, డిజైన్, టెక్నాలజీ అన్నీ మెరుగుపరచాల్సిందే అనిపిస్తోంది. టాటా, మహీంద్రా కూడా అదే దిశగా కొత్త మోడల్స్ తెస్తున్నాయి.

ఇక గ్లోబల్ మార్కెట్‌లోకి వెళ్లేందుకు ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా ఒక పెద్ద అవకాశం ఇస్తున్నాయి. ఉదాహరణకు UK-India చర్చల్లో ఆటోమొబైల్ ముఖ్యాంశం కావడం, మన బ్రాండ్స్‌కు నేరుగా యూరప్, ఆస్ట్రేలియా దారులు తెరుస్తోంది.

EVలే గేమ్‌చేంజర్?
ప్రపంచం ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు వేగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVs) వైపు మలుపు తిరుగుతోంది. పర్యావరణ పరిరక్షణ, ఫ్యూయల్ ఖర్చులు తగ్గించుకోవడం, కొత్త టెక్నాలజీపై ఆసక్తి ఇవన్నీ కలిసి EVల డిమాండ్‌ను రోజురోజుకీ పెంచుతున్నాయి. ఇక్కడే మన టాటా, మహీంద్రాలకు పెద్ద అవకాశం కనిపిస్తోంది.

మహీంద్రా ఇప్పటికే తన కాన్సెప్ట్ SUVsను చూపించి, గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోంది. డిజైన్, టెక్నాలజీ, సేఫ్టీ అలా అన్ని అంతర్జాతీయ ప్రమాణాలు‌కి దగ్గరగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు టాటా కూడా వెనకడుగు వేయకుండా తన Avinya EV సిరీస్ను తీసుకువస్తోంది. ఇవి సరైన రీతిలో, సరైన సమయానికి మార్కెట్‌లోకి వస్తే, భారతీయ బ్రాండ్స్ కూడా గ్లోబల్ స్టేజ్ మీద బలంగా నిలబడగలవు.

ఇక్కడ టాటాకు అదనపు ప్రయోజనం ఒకటి ఉంది. అది ఏమిటంటే, ఇప్పటికే తన దగ్గర ఉన్న Jaguar Land Rover (JLR) బ్రాండ్. దీని ద్వారా టాటా నేరుగా ప్రీమియం గ్లోబల్ మార్కెట్లలోకి సులభంగా ప్రవేశించగలదు. అంటే Avinya లాంటి కొత్త EVలతో మాస్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ, JLR ద్వారా లగ్జరీ సెగ్మెంట్‌లో కూడా తన ఉనికిని బలపరచగలదు.

విదేశీ కంపెనీలు భారత్‌ను ఒక చీప్ మాన్యుఫాక్చరింగ్ హబ్గా వాడుకుంటున్నాయి. మన టాటా, మహీంద్రా మాత్రం చిన్న చిన్న మార్కెట్లలో నెమ్మదిగా అడుగులు వేస్తూ, పెద్ద మార్కెట్లను టార్గెట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. "మేడ్ ఇన్ ఇండియా" పేరు ప్రపంచంలో పెరుగుతుందేమో కానీ 'ఇండియన్ బ్రాండ్స్' పేరు పెరగడానికి ఇంకాస్త టైం పడుతుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+