ముంబై: గతవారం టాప్ టెన్ కంపెనీల్లోని ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.62 లక్షల కోట్లు పెరిగింది. అక్షరాలా వీటి మార్కెట్ క్యాప్ రూ.1,62,774.49 కోట్లు ఎగిసింది. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ భారీగా పెరిగింది. గతవారం బీఎస్ఈ 30 స్టాక్ సూచీ 903.91 పాయింట్లు లేదా 1.88 శాతం ఎగిసింది. కాగా, అంతకుముందు వారం టాప్ 10 కంపెనీల్లోని తొమ్మిదింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.33 లక్షల కోట్లు క్షీణించింది.

మార్కెట్ క్యాప్ జంప్
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.57,086.67 కోట్లు ఎగిసి రూ.12,64,369.99 కోట్లకు చేరుకుంది.
బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ.47,526.08 కోట్లు ఎగిసి రూ.3,28,639.08 కోట్లుగా ఉంది.
ICICI బ్యాంకు ఎం-క్యాప్ రూ.21,033.34 కోట్లు పెరిగి రూ.4,15,348.35 కోట్లుగా నమోదయింది.
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) మార్కెట్ క్యాప్ రూ.15,171.83 పెరిగి రూ.3,15,440.39 కోట్లుగా నమోదయింది.
హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ రూ.10,761.02 కోట్లు ఎగిసి రూ.5,53,053.02 కోట్లుగా ఉంది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ గతవారం రూ.8,559.71 కోట్లు పెరిగి రూ.5,76,867.96 కోట్లుగా నమోదయింది.
కొటక్ మహీంద్రా బ్యాంకు ఎం-క్యాప్ రూ.2,635.84 కోట్లు పెరిగి రూ.3,46,543.78 కోట్లకు చేరుకుంది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ డౌన్
దేశీయ రెండో అతిపెద్ద సంస్థ టీసీఎస్, HDFC, HDFC బ్యాంకుల మార్కెట్ క్యాప్ మాత్రం భారీగా క్షీణించింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మార్కెట్ క్యాప్ రూ.26,411.23 కోట్లు తగ్గి రూ.11,23,919.77 కోట్లకు చేరుకుంది.
HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,917.44 కోట్లు క్షీణించి రూ.4,36,582.10 కోట్లుగా నమోదయింది.
HDFC బ్యాంకు ఎం-క్యాప్ రూ.821.01 కోట్లు తగ్గి రూ.7,78,850.97 కోట్లకు క్షీణించింది.

టాప్ 10 కంపెనీలు
టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాత టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీ లీవర్ లిమిటెడ్, HDFC, ICICI బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!



Click it and Unblock the Notifications