టాప్ టెన్‌లోని ఏడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.2,28,367.09 కోట్లు పెరిగింది. అంతకుముందు వారం టాప్ టెన్‌లోని 9 కంపెనీల మార్కెట్ క్యాప్ అక్షరాలా రూ.1.29 లక్షల కోట్లు పెరిగింది. వరుసగా రెండోవారం మార్కెట్ క్యాప్ ఎగిసింది. అంతకంటే ముందు వారం మార్కెట్లు నష్టాల్లో ముగియడంతే మార్కెట్ క్యాప్ రూ.2.62 లక్షల కోట్లు తగ్గింది. అంతకుముందు వరుసగా రెండు వారాలు నష్టపోయిన మార్కెట్లు, ఇప్పుడు రెండు వారాలు వరుసగా లాభపడ్డాయి. ఒమిక్రాన్ ప్రభావం అంతంతే అనే అభిప్రాయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. క్రితం వారం బీఎస్ఈ బెంచ్ మార్క్ వెయ్యి పాయింట్లకు పైగా లాభపడింది. గతవారం ప్రారంభంలో సూచీలు భారీగా నష్టపోయినప్పటికీ, ఆ తర్వాత కోలుకున్నాయి.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ జంప్
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,35,204.46 కోట్లు ఎగిసి రూ.16,62,776.63 కోట్లకు పెరిగింది.
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,125.39 కోట్లు పెరిగి రూ.8,43,528.19 కోట్లుగా నమోదయింది.
- ఇన్ఫోసిస్ సంస్థ మార్కెట్ క్యాప్ రూ.9,988.16 కోట్లు పెరిగి రూ.7,39,607.12 కోట్లకు చేరుకుంది.
- ఐసీఐసీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.28,817.13 కోట్లు పెరిగి రూ.5,26,170.49 కోట్లకు పెరిగింది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,050.11 పెరిగి రూ.5,08,612.95 కోట్లకు పెరిగింది.
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.22,993.93 కోట్లు ఎగిసి రూ.4,49,747.2 కోట్లుగా నమోదయింది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రూ.19,187.91 కోట్లు పెరిగి రూ.4,41,500.53 కోట్లకు చేరుకుంది.

వీటి మార్కెట్ క్యాప్ డౌన్
- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,146.7 కోట్లు తగ్గి రూ.13,45,178.53 కోట్లకు క్షీణించింది.
- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.2,396 కోట్లు తగ్గి రూ.5,48,136.15 కోట్లకు తగ్గింది.
- భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.4,256.32 కోట్లు క్షీణించి రూ.3,90,263.46 కోట్లకు తగ్గింది.

టాప్ టెన్ కంపెనీలు..
టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, ICICI బ్యాంకు, HDFC, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications