టాప్ 10లోని నాలుగు కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.31 లక్షల కోట్లు జంప్
టాప్ 10 కంపెనీల్లోని నాలుగు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.2,31,320.37 కోట్లు పెరిగింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ భారీగా పెరిగింది. గతవారం 30 షేర్ బీఎస్ఈ సెన్సెక్స్ 884.57 పాయింట్లు లేదా 1.61 శాతం లాభపడింది. సెన్సెక్స్ గతవారం 55,770 పాయింట్ల వద్ద ముగిసింది. లాభపడిన స్టాక్స్‌లో రిలయన్స్ తర్వాత టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.
HDFC బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్, లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC, భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్షీణించింది. ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.68,140 కోట్లు తగ్గింది.

గతవారం రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,38,222.46 కోట్లు పెరిగి రూ.18,80,350.47 కోట్లకు చేరుకుంది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.64,618.85 కోట్లు ఎగిసి రూ.12,58,274.59 కోట్లకు, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.25,728.52 కోట్లు లాభపడి రూ.6,40,373.02 కోట్లకు చేరుకుంది. ఐసీఐసీఐ మార్కెట్ క్యాప్ రూ.2,750.54 కోట్లు తగ్గి రూ.5,17,049.46 కోట్లకు చేరుకుంది. ఈ నాలుగు కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2,31,320.37 కోట్లు పెరిగింది.
ఇక, భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాప్ రూ.25,955.25 కోట్లు తగ్గి రూ.3,76,972.75 కోట్లకు, LIC మార్కెట్ క్యాప్ రూ.5,06,157.94 కోట్లు క్షీణించి రూ.13,472.25 కోట్లకు, HDFC మార్కెట్ క్యాప్ రూ.9,355.02 కోట్లు తగ్గి రూ.4,13,299.36 కోట్లకు, హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ రూ.8,963.69 కోట్లు తగ్గి రూ.5,38,561.56 కోట్లకు క్షీణించింది. HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.6,199.94 కోట్లు తగ్గి రూ.7,66,314.71 కోట్లకు, ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.4,194.57 కోట్లు తగ్గి రూ.4,14,369.71 కోట్లకు క్షీణించింది.


Click it and Unblock the Notifications