పదింట 5 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1 లక్ష కోట్లు పెరిగింది

టాప్ టెన్‌లోని ఐదు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1 లక్ష కోట్లు పెరిగింది. అంతకుముందు వారం ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2,61,812.14 కోట్లు తగ్గింది. దాని కంటే ముందు వారం కూడా దాదాపు అంతేస్థాయిలో పెరిగింది. ఒమిక్రాన్ ప్రభావం అంతంతే అనే అభిప్రాయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలపరిచాయి. క్రితం వారం బీఎస్ఈ బెంచ్ మార్క్ 112.57 పాయింట్లు లేదా 0.10 శాతం మాత్రమే పెరిగింది. అంతకుముందు వారం బీఎస్ఈ బెంచ్ మార్క్ 1,774.93 పాయింట్లు లేదా 3.01 శాతం నష్టపోవడంతో మార్కెట్ క్యాప్ భారీగా క్షీణించింది. ఈసారి కాస్త కోలుకుంది. లాభపడిన కంపెనీల్లో రిలయన్స్, టీసీఎస్, హెచ్‌యూఎల్, విప్రో, ఇన్ఫోసిస్ ఉండగా, నష్టపోయిన సంస్థల్లో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, HDFC బ్యాంకు, HDFC, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ జంప్

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ జంప్

- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,720.62 కోట్లు ఎగిసి రూ.13,57,644.33 కోట్లకు పెరిగింది.

- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.21,035.95 కోట్లు ఎగిసి రూ.16,04,154.56 కోట్లకు పెరిగింది.

- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17,656.95 కోట్లు ఎగిసి రూ.7,83,779.99 కోట్లకు పెరిగింది.

- హిందూస్తాన్ యూనీ లీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.16,000.71 కోట్లు ఎగిసి రూ.5,40,053.55 కోట్లకు పెరిగింది.

- విప్రో మార్కెట్ క్యాప్ రూ.15,730.86 కోట్లు ఎగిసి రూ.3,82,857.25 కోట్లకు పెరిగింది.

వీటి మార్కెట్ క్యాప్ డౌన్

వీటి మార్కెట్ క్యాప్ డౌన్

- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,619.95 కోట్లు నష్టపోయి రూ.7,97,609.94 కోట్లకు క్షీణించింది.

- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,083.97 కోట్లు నష్టపోయి రూ.4,58,838.89 కోట్లకు క్షీణించింది.

- SBI మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,727.82 కోట్లు నష్టపోయి రూ.4,07,720.88 కోట్లకు క్షీణించింది.

- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,048.15 కోట్లు నష్టపోయి రూ.4,13,546.63 కోట్లకు క్షీణించింది.

- ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.476.81 కోట్లు నష్టపోయి రూ.5,05,070.33 కోట్లకు క్షీణించింది.

టాప్ టెన్ కంపెనీలు

టాప్ టెన్ కంపెనీలు

టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, ICICI బ్యాంకు, HDFC, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+